Samajavaragamana Day 1 Collections: ఊహించని వసూళ్లు.. సామజవరగమనకు ఆ టార్గెట్.. హిట్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. అనేకమైన సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ అలరించిన శ్రీ విష్ణు మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల అల్లూరి సినిమాతో ప్లాప్ అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు సామజవరగమన మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూన్ 29న అంటే గురువారం విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ తోపాటు ఫుల్ ఎంటర్టైనర్ అనే ముద్ర పడింది. ఈ నేపథ్యంలో సామజవరగమన చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

నటీనటులు: ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన సామజవరగమన చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీ విష్ణుకు జోడీగా మలయాళీ బ్యూటి రెబ్బ మోనికా జాన్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, వీకే నరేష్, దేవి ప్రసాద్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Samajavaragamana Day 1 Collections:

ప్రీ రిలీజ్ బిజినెస్: మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చిన శ్రీ విష్ణు సామజవరగమన చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయడంతో కాస్తా బజ్ క్రియేట్ అయింది. ఇక శ్రీ విష్ణు మార్కెట్ కు తగినట్లుగానే సామజవరగమన చిత్రాన్ని మొత్తంగా రూ. 3.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా ఏర్పడింది.

Samajavaragamana Day 1 Collections:

ఏరియాలా వారీగా: శ్రీ విష్ణు చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రాలోని అన్ని ఏరియాల వారీగా 1 డే కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్ లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలు వసూళు అయ్యాయి.

Samajavaragamana Day 1 Collections:

మొదటి రోజు: కామెడీ ఎంటర్టైనర్ గా టాక్ వినిపిస్తున్న శ్రీ విష్ణు సామజవరగమన చిత్రానికి తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 80 లక్షల షేర్, రూ. 1.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాల్లో కలుపుకుని ఫస్ట్ డే రూ. 34 లక్షలు వసూళు అయ్యాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 1.14 కోట్లు షేర్, రూ. 2.10 గ్రాస్ కలెక్ట్ అయింది.

Samajavaragamana Day 1 Collections:

లాభం రావాలంటే?: మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ స్వరాలు సమకూర్చిన సామజవరగమన చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 3.20 కోట్ల బిజినెస్ జరగ్గా.. రూ. 3.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఫిక్స్ అయింది. అయితే సినిమాకు తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 1.14 కోట్లు రాగా.. ఇంకా రూ. 2.36 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయినట్లు. ఎంతలేదన్నా మరో రెండు మూడు రోజుల్లో ఈ టార్గెట్ పూర్తి చేసి హిట్ కు దగ్గర్లో ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X