Om Bheem Bush 12 Days Collection: శ్రీ విష్ణుకు జాక్‌పాట్.. కోట్ల సునామీతో రికార్డు.. 14 లక్షలు వస్తే!

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి.. తనలోని టాలెంట్లను నిరూపించుకుని.. మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు శ్రీ విష్ణు. హీరోగా సక్సెస్ అయిన అతడు.. గత ఏడాది భారీ హిట్ కొట్టాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే 'ఓం భీమ్ బుష్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీగానే లభిస్తోంది. అయితే గత వీకెండ్‌లో పుంజుకున్నా మళ్లీ పడిపోతూనే ఉంటోంది. ఈ నేపథ్యంలో 'ఓం భీమ్ బుష్' మూవీ 12 రోజుల కలెక్షన్లను మీరే చూసేయండి మరి!

ఫన్ రైడ్‌గా వచ్చిన సినిమా
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఫన్ రైడ్ సినిమానే 'ఓం భీమ్ బుష్'. శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలకమైన పాత్రలు పోషించారు. సన్నీ ఎమ్ఆర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Sree Vishnu Starrer Om Bheem Bush Movie 12 Days Worldwide Collections Details

ఓ భీమ్ బుష్ బిజినెస్ ఇలా
శ్రీ విష్ణు నటించిన 'ఓం భీమ్ బుష్' మూవీకి నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 9.30 కోట్లు బిజినెస్ అయింది.

12వ రోజు ఇలా.. మొత్తంగా
శ్రీ హర్ష దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా నటించిన 'ఓం భీమ్ బుష్' సినిమాకు రెస్పాన్స్ మరింతగా డౌన్ అవుతూనే ఉంది. అలా 12వ రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 18 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది. వరల్డ్ వైడ్‌గా రూ. 21 లక్షలు రాబట్టింది. ఇలా 12 రోజుల్లో ఈ సినిమా రూ. 9.86 కోట్లు వసూలు చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌కు చేరువగా వచ్చేసింది.

Sree Vishnu Starrer Om Bheem Bush Movie 12 Days Worldwide Collections Details

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X