Om Bheem Bush 2 Weeks Collection: 10 కోట్లతో భారీగా.. తెలుగులో 6వ మూవీగా.. శ్రీ విష్ణు సంచలన రికార్డు
విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోన్నాడు టాలెంటెడ్ గాయ్ శ్రీ విష్ణు. ఆరంభం నుంచీ తనదైన మూవీలతో సత్తా చాటుతోన్న అతడు.. ఇటీవలే 'ఓం భీమ్ బుష్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీగానే లభించింది. అయితే వీకెండ్స్‌లో పుంజుకున్నా వీక్ డేస్‌లో మళ్లీ పడిపోతూనే ఉంటోంది. ఈ నేపథ్యంలో 'ఓం భీమ్ బుష్' మూవీ 14 రోజుల కలెక్షన్లను మీరే చూసేయండి మరి!
ఫస్ స్టోరీతో వచ్చేసిన సినిమా
శ్రీ విష్ణు హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'ఓం భీమ్ బుష్'. శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలకమైన పాత్రలు పోషించారు. సన్నీ ఎమ్ఆర్ మ్యూజిక్ ఇచ్చాడు.

ఓ భీమ్ బుష్ బిజినెస్ ఇలా
శ్రీ విష్ణు హీరోగా చేసిన 'ఓం భీమ్ బుష్' మూవీకి నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 9.30 కోట్లు బిజినెస్ జరిగింది.
14వ రోజు ఎంత వచ్చింది?
గత ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీ విష్ణు అదే ఊపులో ఇప్పుడు 'ఓమ్ భీమ్ బుష్' మూవీని చేశాడు. దీనికి ఆరంభంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అయితే, 14వ రోజు 'టిల్లు స్క్వేర్' మూవీ ప్రభావం కనిపించడంతో డౌన్ అయిపోయింది.. ఫలితంగా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10 లక్షలు షేర్ వసూలు అయింది.
14 రోజులకూ కలిపి ఎంత?
పూర్తి స్థాయి కామెడీ స్టోరీతో రూపొందిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 14 రోజుల్లో అద్భుతమైన స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో రూ. 3.97 కోట్లు షేర్ వసూలు అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలిపి రూ. 3.70 కోట్లు షేర్ వచ్చింది. ఇలా దీనికి రూ. 7.67 కోట్లు షేర్, రూ. 14.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగులో 14 రోజుల్లో రూ. 7.67 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.35 కోట్లు షేర్ వసూలు చేసింది. వీటితో కలిపి 14 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 10.02 కోట్లు షేర్‌తో పాటు రూ. 23.00 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. లాభం ఎంత?
ఫన్ స్టోరీతో రూపొందిన 'ఓమ్ భీమ్ బుష్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.00 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజుల్లో శ్రీ విష్ణు సినిమాకు రూ. 10.02 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2 లక్షలు లాభాలు కూడా వచ్చాయి. అంతేకాదు, ఈ ఏడాది తెలుగులో హిట్ అయిన 6వ చిత్రంగా ఇది నిలిచింది.


Click it and Unblock the Notifications











