Om Bheem Bush 2 Days Collection: శ్రీ విష్ణు కుమ్మేశాడుగా.. 2 రోజుల్లోనే కోట్ల వర్షం.. ఫస్ట్ డే కంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సపోర్టు లేకుండానే హీరోలుగా పరిచయమై.. సత్తా చాటుతోన్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో నేచురల్ యాక్టింగ్‌తో అలరిస్తోన్న శ్రీ విష్ణు ఒకడు. చాలా కాలంగా తనదైన మార్కును చూపించే చిత్రాలతో దూసుకుపోతోన్న అతడు.. ఇప్పుడు 'ఓం భీమ్ బుష్' అనే క్రేజీ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో స్పందన భారీగా వస్తోంది. దీంతో కలెక్షన్లు కూడా అదే రేంజ్‌లో లభిస్తున్నాయి. మరి 'ఓం భీమ్ బుష్' మూవీ 2 రోజుల వసూళ్లను మీరే చూసేయండి మరి!

Sree Vishnu Starrer Om Bheem Bush Movie 2 Days Worldwide Collections Details

ఫుల్ కామెడీతో ఓం భీమ్ బుష్
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో నటించిన చిత్రమే 'ఓం భీమ్ బుష్'. శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ సినిమాను వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సన్నీ ఎమ్ఆర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

ఓ భీమ్ బుష్ బిజినెస్ ఇలా

శ్రీ విష్ణు హీరోగా చేసిన 'ఓం భీమ్ బుష్' మూవీకి నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 9.30 కోట్లు బిజినెస్ జరిగింది.

Sree Vishnu Starrer Om Bheem Bush Movie 2 Days Worldwide Collections Details

2వ రోజు ఎంత వచ్చింది?
కడుపుబ్బా నవ్వించే కథతో తెరకెక్కిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో రూ. 85 లక్షలు షేర్ వసూలు అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలిపి రూ. 80 లక్షలు షేర్ వచ్చింది. ఇలా రెండు రాష్ట్రాల్లో దీనికి రూ. 1.65 కోట్లు షేర్, రూ. 2.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకూ కలిపి ఎంత?

విభిన్నమైన నేపథ్యంతో రూపొందిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో అద్భుతమైన స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో రూ. 1.45 కోట్లు షేర్ వసూలు అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలిపి రూ. 1.35 కోట్లు షేర్ వచ్చింది. ఇలా రెండు రాష్ట్రాల్లో దీనికి రూ. 2.80 కోట్లు షేర్, రూ. 5.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

Sree Vishnu Starrer Om Bheem Bush Movie 2 Days Worldwide Collections Details

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగులో 2 రోజుల్లో రూ. 1.80 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.25 కోట్లు షేర్ వసూలు చేసింది. వీటితో కలిపి 2 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 4.05 కోట్లు షేర్‌తో పాటు రూ. 10.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

క్రేజీ స్టోరీతో రూపొందిన 'ఓమ్ భీమ్ బుష్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.00 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో శ్రీ విష్ణు సినిమాకు రూ. 4.05 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 5.95 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X