Om Bheem Bush 3 Days Collection: శ్రీ విష్ణు ఊతకొట్టుడు.. భారీ వసూళ్లతో రికార్డు.. అక్కడ లాభాల్లోకి!
టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపుతో దూసుకుపోతోన్నారు. అందులో శ్రీ విష్ణు ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తోన్న అతడు.. తాజాగా 'ఓం భీమ్ బుష్' అనే క్రేజీ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీగా వస్తోంది. దీంతో కలెక్షన్లు కూడా పోటెత్తుతూనే ఉన్నాయి. మరి 'ఓం భీమ్ బుష్' మూవీ 3 రోజుల వసూళ్లను మీరే చూసేయండి మరి!
ఓం భీమ్ బుష్ అంటూ రాక:శ్రీ విష్ణు హీరోగా.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'ఓం భీమ్ బుష్'. శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ సినిమాను వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. సన్నీ ఎమ్ఆర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఓ భీమ్ బుష్ బిజినెస్ ఇలా:శ్రీ విష్ణు నటించిన 'ఓం భీమ్ బుష్' మూవీకి నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 9.30 కోట్లు బిజినెస్ అయింది.
3వ రోజు ఎంత వచ్చింది?:టాలెంటెడ్ గాయ్ శ్రీ విష్ణు హీరోగా నటించిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో రూ. 70 లక్షలు షేర్ వసూలు అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలిపి రూ. 75 లక్షలు షేర్ వచ్చింది. ఇలా రెండు రాష్ట్రాల్లో దీనికి రూ. 1.45 కోట్లు షేర్, రూ. 2.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకూ కలిపి ఎంత?:ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో అద్భుతమైన స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో రూ. 2.15 కోట్లు షేర్ వసూలు అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలిపి రూ. 2.10 కోట్లు షేర్ వచ్చింది. ఇలా దీనికి రూ. 4.25 కోట్లు షేర్, రూ. 7.60 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగులో 3 రోజుల్లో రూ. 4.25 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.55 కోట్లు షేర్ వసూలు చేసింది. వీటితో కలిపి 3 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 5.80 కోట్లు షేర్‌తో పాటు రూ. 17.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కథతో తెరకెక్కిన 'ఓమ్ భీమ్ బుష్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.00 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో శ్రీ విష్ణు సినిమాకు రూ. 5.80 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.20 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. ఇక, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో ఈ మూవీ టార్గెట్‌ను పూర్తి చేసుకుంది.


Click it and Unblock the Notifications











