Om Bheem Bush 6 Days Collection: మాయ చేసిన శ్రీ విష్ణు.. 6 రోజుల్లో కోట్ల వర్షం.. హిట్‌కు ఎంత దూరమంటే!
టాలీవుడ్‌లో విలక్షణమైన నటనతో సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ శ్రీ విష్ణు ఒకడు. నేచురల్ యాక్టింగ్‌తో కెరీర్ ఆరంభంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అతడు.. విభిన్నమైన సినిమాలతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'ఓం భీమ్ బుష్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీగా లభిస్తోంది. దీంతో కలెక్షన్లు బాగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఓం భీమ్ బుష్' మూవీ 6 రోజుల వసూళ్లను మీరే చూసేయండి!
కామెడీ కథతో ఓం భీమ్ బుష్
శ్రీ విష్ణు హీరోగా.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ చిత్రమే 'ఓం భీమ్ బుష్'. శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. సన్నీ ఎమ్ఆర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

ఓ భీమ్ బుష్ బిజినెస్ ఇలా
శ్రీ విష్ణు నటించిన 'ఓం భీమ్ బుష్' మూవీకి నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 9.30 కోట్లు బిజినెస్ అయింది.
6వ రోజు డౌన్.. మొత్తమేమో
ఫుల్ లెంగ్త్ కామెడీ జోనర్‌లో రూపొందిన 'ఓం భీమ్ బుష్' సినిమాకు ఆరంభంలో మంచి స్పందన వచ్చినా.. వీక్ డేస్‌లో అది తగ్గిపోతుంది. ముఖ్యంగా 6వ రోజు ఇంకాస్త డౌన్ అయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 35 లక్షలు రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 42 లక్షలు వసూలు చేసింది. ఇలా 6 రోజుల్లో ఈ మూవీ రూ. 8 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.


Click it and Unblock the Notifications











