Om Bheem Bush 7 Days Collection: శ్రీ విష్ణు మూవీకి ఊహించని వసూళ్లు.. వారంలో ఎన్ని కోట్లు వచ్చాయంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే వచ్చి.. తనదైన టాలెంట్లతో మాయ చేసి.. ఇప్పుడు హీరోగా దూసుకుపోతోన్నాడు శ్రీ విష్ణు. సహజసిద్ధమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతడు.. ఈ మధ్య హిట్లతో సత్తా చాటుతోన్నాడు. ఈ ఊపులోనే ఇటీవలే 'ఓం భీమ్ బుష్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో ప్రేక్షకుల స్పందన కూడా భారీగా లభించింది. అయితే వీక్ డేస్‌లో డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'ఓం భీమ్ బుష్' మూవీ 7 రోజుల వసూళ్లను మీరే చూసేయండి!
క్రేజీ కాంబోలో వచ్చిన మూవీ:శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో నటించిన కామెడీ సినిమానే 'ఓం భీమ్ బుష్'. శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. సన్నీ ఎమ్ఆర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

ఓ భీమ్ బుష్ బిజినెస్ ఇలా:శ్రీ విష్ణు హీరోగా చేసిన 'ఓం భీమ్ బుష్' మూవీకి నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 9.30 కోట్లు బిజినెస్ జరిగింది.
7వ రోజు ఎంత వచ్చింది?:'సామజవరగమన' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న టాలెంటెడ్ గాయ్ శ్రీ విష్ణు నటించిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. అయితే, 7వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ ఈ మూవీకి రెస్పాన్స్ కాస్తంత పెరిగింది. ఫలితంగా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 32 లక్షలు షేర్ వసూలు అయింది.

7 రోజులకూ కలిపి ఎంత?:పూర్తి స్థాయి వినోదభరితమైన కథతో రూపొందిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో అద్భుతమైన స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో రూ. 3.27 కోట్లు షేర్ వసూలు అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలిపి రూ. 3.15 కోట్లు షేర్ వచ్చింది. ఇలా దీనికి రూ. 6.42 కోట్లు షేర్, రూ. 11.70 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగులో 7 రోజుల్లో రూ. 6.42 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.05 కోట్లు షేర్ వసూలు చేసింది. వీటితో కలిపి 7 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 8.47 కోట్లు షేర్‌తో పాటు రూ. 20.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'ఓమ్ భీమ్ బుష్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.00 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో శ్రీ విష్ణు సినిమాకు రూ. 8.47 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.53 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











