Om Bheem Bush 9 Days Collection: శ్రీ విష్ణు మూవీకి ఊహించని వసూళ్లు.. ఇంకెంత వస్తే హిట్ అవుతుందంటే!
సహజసిద్ధమైన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ గాయ్ శ్రీ విష్ణు. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. గత ఏడాది కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇటీవలే 'ఓం భీమ్ బుష్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో ఆడియెన్స్ రెస్పాన్స్ కూడా భారీగా లభించింది. అయితే ఇప్పుడు మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఓం భీమ్ బుష్' మూవీ 9 రోజుల వసూళ్లపై లుక్కేయండి!
నవ్వించే కథతో వచ్చేసింది
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'ఓం భీమ్ బుష్'. శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. సన్నీ ఎమ్ఆర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలకమైన పాత్రలు పోషించారు.

ఓ భీమ్ బుష్ బిజినెస్ ఇలా
శ్రీ విష్ణు హీరోగా చేసిన 'ఓం భీమ్ బుష్' మూవీకి నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 9.30 కోట్లు బిజినెస్ జరిగింది.
9వ రోజు ఎంత వచ్చింది?
ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ వెళ్తోన్న శ్రీ విష్ణు నటించిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. అయితే, 9వ రోజు 'టిల్లు స్క్వేర్' మూవీ ప్రభావం కనిపించినా కాస్త పుంజుకుందనే చెప్పాలి. ఫలితంగా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 24 లక్షలు షేర్ వసూలు అయింది.

9 రోజులకూ కలిపి ఎంత?
పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో అద్భుతమైన స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో రూ. 3.49 కోట్లు షేర్ వసూలు అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలిపి రూ. 3.38 కోట్లు షేర్ వచ్చింది. ఇలా దీనికి రూ. 6.87 కోట్లు షేర్, రూ. 12.55 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబోలో వచ్చిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగులో 9 రోజుల్లో రూ. 6.87 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.16 కోట్లు షేర్ వసూలు చేసింది. వీటితో కలిపి 9 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 9.03 కోట్లు షేర్‌తో పాటు రూ. 21.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ సబ్జెక్టుతో రూపొందిన 'ఓమ్ భీమ్ బుష్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.00 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో శ్రీ విష్ణు సినిమాకు రూ. 9.03 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 97 లక్షలు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











