Om Bheem Bush Day 1 Collection: శ్రీ విష్ణు మూవీకి ఊహించని వసూళ్లు.. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే!
టాలీవుడ్‌లో నేచురల్ యాక్టింగ్‌తో స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ఒకడు. సోలో హీరోగా మారిన తర్వాత విభిన్నమైన సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న అతడు.. గత ఏడాది బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు.
ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'ఓం భీమ్ బుష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మొదటి రోజు మంచి స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్లు భారీగానే లభించాయి. మరి 'ఓం భీమ్ బుష్' మూవీ ఫస్ట్ డే వసూళ్లను మీరే చూసేయండి మరి!

కామెడీ కథతో ఓం భీమ్ బుష్
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన కామెడీ మూవీనే 'ఓం భీమ్ బుష్'. శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ సినిమాను వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సన్నీ ఎమ్ఆర్ సంగీతాన్ని ఇచ్చాడు.
ఓ భీమ్ బుష్ బిజినెస్ ఇలా
శ్రీ విష్ణు నటించిన 'ఓం భీమ్ బుష్' మూవీకి నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 9.30 కోట్లు బిజినెస్ అయింది.
డీసెంట్ టాక్‌తో తక్కువగా
క్రేజీ కామెడీతో రూపొందిన 'ఓం భీమ్ బుష్' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే అంటే బాగానే లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే కంటే ఎక్కువ వసూళ్లు లభించాయని చెప్పుకోవచ్చు.

తొలి రోజు ఎంత వచ్చింది?
విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి ఫలితంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో రూ. 60 లక్షలు షేర్ వసూలు అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలిపి రూ. 55 లక్షలు షేర్ వచ్చింది. ఇలా రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 1.15 కోట్లు షేర్, రూ. 2.15 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 1.15 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 65 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 1.80 కోట్లు షేర్‌తో పాటు రూ. 3.50 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'ఓమ్ భీమ్ బుష్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.00 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు శ్రీ విష్ణు సినిమాకు రూ. 1.80 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 8.20 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











