Om Bheem Bush: శ్రీ విష్ణు మూవీకి రికార్డు బిజినెస్.. టాలీవుడ్ షాకయ్యేలా.. అన్ని కోట్లు వస్తేనే హిట్
తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ శ్రీ విష్ణు ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరోగా మారిన అతడు.. ఏమాత్రం బ్రేకులు లేకుండా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇప్పుడు తనకు పేరు తెచ్చిన కామెడీ జోనర్‌లో 'ఓం భీమ్ బుష్' అనే సినిమాను చేశాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఎన్ని కోట్ల బిజినెస్ జరిగింది? ఎంత వసూలు చేస్తే ఇది విజయం సాధిస్తుంది? అనే విషయాలను మీరే చూడండి!
ఓం భీమ్ బుష్ అంటూ విష్ణు
శ్రీ విష్ణు హీరోగా.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమే 'ఓం భీమ్ బుష్'. శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ సినిమాను వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సన్నీ ఎమ్ఆర్ సంగీతాన్ని అందించాడు.

అలాంటి కథతో ఫన్నీగానే
ముగ్గురు స్నేహితులు కలిసి ఓ గ్రామానికి చేరుకోవడం.. అక్కడ సైంటిస్టుల పేరుతో ప్రయోగాలు చేయడం.. చివరికి ఓ నిధి కోసం నానా తంటాలు పడడం అనే కాన్సెప్టుతో తెరకెక్కిన చిత్రమే 'ఓమ్ భీమ్ బుష్'. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది.
గ్రాండ్ రిలీజ్.. టాక్ అలా
గత ఏడాది కెరీర్‌లో బిగ్ హిట్‌ను అందుకున్న శ్రీ విష్ణు నటించిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీ ఎన్నో అంచనాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి స్పందన కూడా లభిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే కలెక్షన్లు కూడా భారీగానే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సినిమా ప్రీ బిజినెస్ ఇలా
ఫుల్ లెంగ్త్ కామెడీతో రూపొందిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో దీనికి అన్ని ఏరియాల్లో మంచి డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 4.00 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 8.00 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన 'ఓమ్ భీమ్ బుష్' మూవీపై అందరిలో ఆసక్తి ఉంది. అందుకు తగ్గట్లే మార్కెట్ పరంగా ఇది బయ్యర్ల దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 1.20 కోట్లకు అమ్ముడైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 9.30 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.

అన్ని కోట్లు వస్తేనే హిట్
శ్రీ విష్ణు నటించిన 'ఓమ్ భీమ్ బుష్' సినిమాకు ఊహించని విధంగా రూ. 9.30 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 10.00 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే 'ఓమ్ భీమ్ బుష్' సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తుంది. ఇదిలా ఉండగా.. శ్రీ విష్ణు కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బిజినెస్ అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications











