Samajavaragamana Collections: వసూళ్ల సునామీ.. ఆ క్లబ్‌లోకి సామజవరగమన.. కోట్లల్లో లాభాలు!

తెలుగులో మంచి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల పోలీస్ ఆఫీసర్ గా చేసిన అల్లూరి ప్లాప్ తో నిరాశపరిచింది. తర్వాత మంచి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో తాను ఎప్పుడూ చేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథాంశంతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఫలితంగా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసి హిట్ అందుకున్నాడు. మరి శ్రీ విష్ణు సామజరవరగమన చిత్రానికి 4 రోజుల్లో ఎంత లాభం వచ్చిందనే లెక్కలు చూస్తే...

మంచి రెస్పాన్స్:శ్రీ విష్ణు, మలయాళీ క్యూట్ బ్యూటీ రెబ్బ మౌనిక జాన్ తొలిసారిగా జంటగా నటించిన చిత్రం సామజరవరగమన, ద్రిష్టి, వివాహభోజనంబు వంటి సినిమాలను అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన సామజవరగమన చిత్రం జూన్ 29న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఫలితంగా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

Sree Vishnu Starrer Samajavaragamana Movie 4 Days Official Worldwide Box Office Collection

బిజినెస్ డీటెల్స్:ఫ్యామిలీ కామెడీ వినోదాత్మక చిత్రంగా వచ్చిన శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ సామజవరగమన. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే మార్కెట్ అయింది. దీంతో సామజవరగమన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా.. రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.

Sree Vishnu Starrer Samajavaragamana Movie 4 Days Official Worldwide Box Office Collection

నాలుగో రోజు:సామజవరగమన చిత్రానికి నైజాంలో రూ. 46 లక్షలు, సీడెడ్ రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 7 లక్షలు, గుంటూరు రూ. 9 లక్షలు, కృష్ణా రూ. 10 లక్షలు, నెల్లూరు రూ. 6 లక్షలు ఇలా అన్ని ఏరియాలు కలుపుకుని రూ. 1.16 కోట్లు షేర్, రూ. 20.5 కోట్ల షేర్ వసూలు అయింది. అంటే మూడో రోజుతో పోలిస్తే 4వ రోజు అయిన ఆదివారం వసూళ్లు పెరిగాయి.

Sree Vishnu Starrer Samajavaragamana Movie 4 Days Official Worldwide Box Office Collection

4 రోజుల్లో-తెలుగులో:వెన్నెల కిశోర్, వీకే నరేష్ కామెడీతో అదరగొట్టిన సామజవరగమన సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఈ చిత్రానికి 4 రోజుల్లో నైజాంలో రూ. 1.64 కోట్లు, సీడెడ్ లో రూ. 42 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 46 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 27 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలు వసూలు అయింది.

వరల్డ్ వైడ్ గా:శ్రీ విష్ణు సామజవరగమన సినిమాకు 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.71 కోట్ల షేర్, రూ. 6.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలన్నీ కలిపి 4 రోజులకు రూ. 1.70 కోట్లు కలెక్ట్ అయింది. ఇలా వరల్డ్ వైడ్ గా సామజవరగమనకు 4 రోజుల్లో రూ. 5.41 కోట్లు షేర్, రూ. 10.10 గ్రాస్ కలెక్ట్ అయింది. అంటే చిన్న సినిమాగా రిలీజై 4 రోజుల్లోనే రూ. 10 కోట్ల క్లబ్ లోకి చేరింది.

Sree Vishnu Starrer Samajavaragamana Movie 4 Days Official Worldwide Box Office Collection

లాభాలు ఎంతంటే?:సామజవరగమన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. దీంతో ఈ చిత్రానికి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 5.41 కోట్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇప్పటికే పూర్తి కాగా.. రూ. 1.91 కోట్ల లాభంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో శ్రీ విష్ణు ఖాతాలో భారీ హిట్ చేరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X