Samajavaragamana Collections: సామజవరగమన కలెక్షన్ల హవా.. లాభాలు ఏంతో తెలిస్తే?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. మొదటి నుంచి డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఎక్కువగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ చిత్రాలతో అలరిస్తూ ఉంటాడు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలీవరీతో అభిమానులను సంపాదించుకున్నాడు. శ్రీ విష్ణు నటించిన చిత్రం లేటెస్ట్ మూవీ సామజవరగమన. మొదటి నుంచే పాజిటవ్ వైబ్రేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామజవరగమన చిత్రానికి కలెక్షన్స్ బాగున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు 6 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయనే లెక్కలు చూస్తే..
మాలీవుడ్ బ్యూటి:ద్రిష్టి, వివాహభోజనంబు సినిమాలను డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన సినిమానే సామజవరగమన. ఇందులో శ్రీ విష్ణుకు జోడీగా మాలీవుడ్ క్యూట్ బ్యూటి రెబ్బ మౌనిక జాన్ నటించింది. జూన్ 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ వీకే నరేష్, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు.

ఎంత బిజినెస్ అంటే?:సామజవరగమన చిత్రం టీజర్, ట్రైలర్ తో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రూ. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాను వరల్డ్ వైడ్ గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. సామజవరగమన మూవీకి ప్రపంచవ్యాప్తంగా గా రూ. 3.20 కోట్ల బిజినెస్ జరిగింది.
ఏపీ, తెలంగాణలో:సామజవరగమన సినిమాకు నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్ రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 3 లక్షలు, గుంటూరు రూ. 4 లక్షలు, కృష్ణా రూ. 4 లక్షలు, నెల్లూరు రూ. 2 లక్షలు వచ్చాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున రూ. 51 లక్షల షేర్, రూ. 1 కోటి గ్రాస్ కలెక్ట్ అయింది. అంటే 5వ రోజు రూ. 57 లక్షలు రాగా.. 6వ నాడు రూ. 51 లక్షలు వచ్చాయి.

6 రోజుల్లో:సామజవరగమన మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఇప్పటికీ 6 రోజుల్లో ఈ చిత్రానికి నైజాంలో రూ. 2.06 కోట్లు, సీడెడ్ లో రూ. 56 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 62 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 35 లక్షలు, కృష్ణాలో రూ. 36 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలు వసూలు అయింది.

ప్రపంచవ్యాప్తంగా:శ్రీ విష్ణు సామజవరగమనకు 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.78 కోట్ల షేర్, రూ. 8.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలన్నీ కలిపి 6 రోజులకు రూ. 2.36 కోట్లు కలెక్ట్ అయింది. ఇలా వరల్డ్ వైడ్ గా సామజవరగమనకు 6 రోజుల్లో రూ. 7.14 కోట్లు షేర్, రూ. 13.65 గ్రాస్ కలెక్ట్ అయింది.

లాభాలు ఎంతంటే?:శ్రీ విష్ణు లేటెస్ట్ సినిమా సామజవరగమనకు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. దీంతో ఈ చిత్రానికి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 7.14 కోట్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకుని రూ. 3.64 కోట్ల లాభాలు అందుకుంది. దీంతో సామజవరగమన చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











