Samajavaragamana Collections: సామజవరగమనకు షాకింగ్ కలెక్షన్స్.. లాభాలు మాత్రం అలా!
తెలుగులో మంచి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు శ్రీ విష్ణు. చిన్న పాత్రలు పోషిస్తూ కథానాయకుడిగా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ సత్తా చాటుతున్నాడు. అయితే ఇటీవల పోలీస్ ఆఫీసర్ గా చేసిన అల్లూరి సినిమా ప్లాప్ కాగా.. తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా సామజవరగమన. జూన్ 29న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఫలితంగా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో సామజవరగమన 8 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయంటే..
ఆడియెన్స్ ఫిదా: యంగ్ హీరో శ్రీ విష్ణు, అందమైన మలయాళ ముద్దుగుమ్మ రెబ్బ మౌనిక జాన్ తొలిసారిగా జంటగా నటించిన చిత్రం సామజరవరగమన, ద్రిష్టి, వివాహభోజనంబు వంటి సినిమాలను అందించిన రామ్ అబ్బరాజు తెరకెక్కించిన సామజవరగమన సినిమాలో వీకే నరేష్, వెన్నెల కిశోర్ పండించిన హాస్యానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్: ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన శ్రీ విష్ణు తాజా చిత్రం సామజవరగమన. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే మార్కెట్ అయింది. దీంతో సామజవరగమన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా.. రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.

8వ రోజు: సామజవరగమన సినిమాకు నైజాంలో రూ. 17 లక్షలు, సీడెడ్ రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 2 లక్షలు, గుంటూరు రూ. 3 లక్షలు, కృష్ణా రూ. 3 లక్షలు, నెల్లూరు రూ. 1 లక్ష ఇలా అన్ని ఏరియాలు కలుపుకుని రూ. 43 లక్షలు షేర్, రూ. 90 లక్షల గ్రాస్ కలెక్ట్ అయింది. అయితే ఆదిపురుష్, స్పై సినిమాలతో పోలిస్తే కలెక్షన్స్ బాగున్నా రోజురోజూకీ కాస్తా తగ్గుతూ వస్తున్నాయి.

8 రోజుల్లో-తెలుగులో: గోపి సుందర్ సంగీతం అందించిన సామజవరగమన సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఈ మూవీకి 8 రోజుల్లో నైజాంలో రూ. 2.44 కోట్లు, సీడెడ్ లో రూ. 70 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 80 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, గుంటూరులో రూ. 41 లక్షలు, కృష్ణాలో రూ. 43 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలు కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
వరల్డ్ వైడ్ గా: శ్రీ విష్ణు సామజవరగమన మూవీకి 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.75 కోట్ల షేర్, రూ. 10.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలన్నీ కలిపి 8 రోజులకు రూ. 2.54 కోట్లు కలెక్ట్ అయింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా సామజవరగమనకు 8 రోజుల్లో రూ. 8.29 కోట్లు షేర్, రూ. 16.15 గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్-ప్రాఫిట్ : సామజవరగమన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. దీంతో ఈ చిత్రానికి 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 8.29 కోట్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ మూడు రోజుల్లోనే పూర్తి కాగా.. రూ. 4.79 కోట్ల లాభంతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంటే చిన్న సినిమాగా వచ్చిన శ్రీ విష్ణు ఖాతాలో భారీ హిట్ చేరింది.


Click it and Unblock the Notifications











