SWAG Collection Day 2: శ్రీ విష్ణు నట విశ్వరూపం 'స్వాగ్'.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

SWAG Box Office Collection: యంగ్ హీరో శ్రీవిష్ణు న‌టించిన 'శ్వాగ్' మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. లింగ‌వివ‌క్ష అనే అంశానికి కామెడీని జోడించి తెరకెక్కిన చిత్రం 'శ్వాగ్'. 'రాజ రాజ చోర' దర్శకుడు హసిత్ గోలి రూపొందిన 'శ్వాగ్' మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ మూవీలో శ్రీ విష్ణు సరసన హీరోయిన్ రీతూ వర్మ, దక్ష నగార్కర్ నటించారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్ తదితరులు నటించారు. అయితే దర్శకుడు హసిత్ గోలి 'రాజ రాజ చోర'మూవీ హిట్ అవ్వడంతో 'శ్వాగ్' పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే.. ప్ర‌మోష‌న్స్‌తోపాటు టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ డిఫ‌రెంట్‌గా ఉండ‌టంతో తొలిరోజు స్వాగ్‌ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌నే రాబట్టినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎంత వసూలు చేసిందంటే?

'రాజ రాజ చోర'మూవీ హిట్ కావడంతో శ్వాగ్ మూవీలో శ్రీవిష్ణు తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాల్లో హీరో శ్రీవిష్ణు ఐదు పాత్ర‌ల్లో క‌నిపించ‌గా.. హీరోయిన్ రీతూ వ‌ర్మ డ్యూయల్ రోల్ నటించింది. సమాజంలో ఆడ‌, మ‌గ, మడ అనే భేదాలు లేకుండా అంద‌రూ స‌మాన‌మే అనే విషయాన్ని చాలా సున్నితంగా చూపించారు ద‌ర్శ‌కుడు హసిత్ గోలి. కామెడీ జోనర్ గా తెరకెక్కిన ప్రేక్షకులకు నవ్వించుకుంటునే చెప్పాల‌నుకున్న, ఇవ్వాలనుకున్న సందేశాన్నిచూపించారు డైరెక్టర్.

Sree Vishnu SWAG movie Box Office Collection Day 2 Prediction

హీరో శ్రీ విష్ణు న‌ట‌న‌కు మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి. తాను నటించిన ఐదు పాత్ర‌ల‌కు పూర్తిగా న్యాయం చేశాడ‌ని అంటున్నారు సినీ లవర్స్. ఇక మీరాజాస్మిన్‌, రీతూ వ‌ర్మ న‌ట‌న కూడా ఈ మూవీకి ఫ్లస్ పాయింట్. శ్వాగ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్ పై రూపొందించారు. ఈ సినిమాకు వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ అందించారు. ర‌విబాబు, సునీల్‌, గోప‌రాజు ర‌మ‌ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఇక శ్వాగ్ మూవీ కలెక్షన్ పరంగా చూస్తే.. SWAG పాన్ ఇండియా వైడ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు (శుక్ర‌వారం) రోజు కోటికిపైనే ఈ మూవీ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు చెబుతోన్నారు. తొలి రోజు మిక్స్ టాక్ వచ్చింది. కానీ అనుకున్న విధంగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక రెండవ రోజు అంచనా ప్రకారం.. ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్‌లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోందనీ, ఈ మూవీ రెండో రోజు దాదాపు 1.25 కోట్లు వసూలు చేసే అవకాముందని తెలుస్తోంది. ఇలా రెండు రోజు అనుకున్నట్టు బిజినెస్ జరిగితే.. శ్వాగ్ కలెక్షన్లు ₹2.25 కోట్లకు చేరుకుంది .

శ్రీ విష్ణు 'శ్వాగ్' మూవీకి రూ.5.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 5.9 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే.. కేవలం వారం లేదా పది రోజుల్లో ఈ పాయింట్ ను దాటేస్తోంది. నెటిగివ్ టాక్ వస్తే.. ఈ దసరా మూమెంట్ లో ప్రేక్షకులకి 'దేవర', 'సత్యం సుందరం' వంటి సినిమాలు ఆప్షన్ గా ఉన్నాయి. దీంతో స్వాగ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా దాటడం కష్టంగా మారుతోంది.

ఇదిలా ఉంటే.. శ్వాగ్ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న‌ది. థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు వారాల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానున్న‌ట్లు సమాచారం. అంటే.. న‌వంబ‌ర్ రెండవ వారంలో శ్వాగ్ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఫ్యాన్సీ రేటుకు స్వాగ్ ఓటీటీ డీల్ క్లోజ్ అయిన‌ట్లు స‌మాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X