Mrithyunjay Day 1 Collections: మృత్యుంజయ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. శ్రీవిష్ణు మూవీకి తొలిరోజు ఎన్ని కోట్లంటే?

Mrithyunjay Box Office Collections: టాలీవుడ్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీ విష్ణు (Sree Vishnu). ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ మృత్యుంజయ్ (Mrithyunjay). ఈ మూవీ మార్చి 6న (నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'మృత్యుంజయ్' సినిమా విడుదలకు ముందే థ్రిల్లర్ కాన్సెప్ట్ కారణంగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన కథ, ఇన్వెస్టిగేషన్ అంశాలు ట్రైలర్ ద్వారా భారీ క్యూరియాసిటీని పెంచేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

యాక్షన్-ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'మృత్యుంజయ్' మూవీకి శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. హీరో శ్రీ విష్ణు సరసన హీరోయిన్‌గా రెబ్బా మోనికా జాన్ నటించారు. రచ్చ రవి, సిజ్జు, మిర్చి మాధవి, సుదర్శన్, కృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంగీతాన్ని కాలభైరవ అందించగా, సినిమాటోగ్రఫీని విద్యాసాగర్ చింతా, ఎడిటింగ్‌ను శ్రీకర్ ప్రసాద్ నిర్వహించారు.

Sree Vishnu s Mrithyunjay Day 1 Expected Box Office Collection Worldwide

మృత్యుంజయ్ స్టోరీ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. భావోద్వేగాలను కలగలిపిన థ్రిల్లర్‌గా సాగుతుంది. విక్రాంత్ అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ ఘటనతో అతని చిన్నారి అనాథగా మారుతుంది. ఆ పాప మౌనం వెనుక ఉన్న రహస్యం కథలో కీలకంగా మారుతుంది. ఈ సమయంలో జై (శ్రీవిష్ణు) అనే యువకుడు తన స్నేహితుడి మరణం వెనుక నిజం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. క్రైమ్ బ్యూరోలో ఉద్యోగం కోసం ప్రయత్నించినా తిరస్కరించబడతాడు. అయినప్పటికీ నిజాన్ని బయటపెట్టాలనే పట్టుదలతో విచారణ కొనసాగిస్తాడు. ఆ మర్డర్ మిస్టరీని ఎలా చేధిస్తాడు అనేది స్టోరీ.

టాలీవుడ్‌లో శ్రీ విష్ణు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటన, కథల ఎంపిక, కామెడీ టైమింగ్‌కు ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. ట్రేడ్ వర్గాల్లో కూడా ఆయన సినిమాలకు ఒక సపరేట్ మార్కెట్ ఉందని చెప్పొచ్చు. గతంలో వచ్చిన ఆయన సినిమాలు పెద్ద హైప్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఇక మృత్యుంజయ్ మూవీ సుమారు రూ.20 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కినట్టు తెలుస్తోంది.

థియేట్రికల్ బిజినెస్
ట్రేడ్ సమాచారం ప్రకారం 'మృత్యుంజయ్' సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇందులో నైజాం ప్రాంతంలో రూ.2.5 కోట్లు, సీడెడ్‌లో రూ.0.40 కోట్లు, ఆంధ్ర ప్రాంతాల్లో కలిపి సుమారు రూ.2.2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.0.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.0.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ.6.5 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది.

ఓపెనింగ్ కలెక్షన్స్
హీరో శ్రీ విష్ణు సినిమాకు విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రారంభ అంచనాల ప్రకారం తొలి రోజు వర్డల్ వైస్ గా సుమారు రూ.2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. నెట్ కలెక్షన్లు దాదాపు రూ.2.1 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.ఈ సినిమా వీకెండ్‌లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జోష్ కొనసాగితే.. మొదటి వారంలోనే రూ.20 కోట్ల మార్క్ క్రాస్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X