Raja Raja Chora 7 Days Collections: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు తడబాటు.. ఎట్టకేలకు వసూళ్లు ఎలా ఉన్నాయంటే!
బ్యాగ్రౌండ్ లేకుండానే కెరీర్‌ను ప్రారంభించి తనలోని టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నాడు టాలెంటెడ్ గాయ్ శ్రీవిష్ణు. విలక్షణమైన నటనతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న అతడు.. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కించేస్తున్నాడు. ప్రతి చిత్రంలోనూ అద్భుతమైన నటనను కనబరుస్తూ అన్నింటినీ వన్ మ్యాన్ షోలుగా మార్చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శ్రీవిష్ణు ఇప్పుడు 'రాజ రాజ చోర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి వారం కలెక్షన్ల రిపోర్టు మీ అందరి కోసం!

దోచుకోడానికి అలా వచ్చేసిన శ్రీవిష్ణు
టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రమే 'రాజ రాజ చోర'. నూతన దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటించింది. వివేక్ సాగర్ దీనికి సంగీతం అందించాడు. పుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

అంచనాలకు తగ్గట్లుగానే ప్రీ బిజినెస్
సాధారణంగా శ్రీవిష్ణు నటించిన సినిమా అంటే సామాన్య ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంటుంది. కచ్చితంగా అతడు వైవిధ్యమైన కథనే ఎంపిక చేసుకుంటాడని, యాక్టింగ్‌తో అదరగొడతాడని అంతా అనుకుంటారు. అలాగే 'రాజ రాజ చోర' విషయంలోనూ జరిగింది. టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అదిరిపోయే టాక్.. కలెక్షన్లు నిలకడ
'రాజ రాజ చోర' సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలా నవ్వుకున్న సినిమా రాలేదన్న కామెంట్లు వినిపించాయి. దీంతో ఈ చిత్రానికి మరింత ఆదరణ లభించింది. ఫలితంగా ఓవర్సీస్, నైజాం, ఆంధ్రాలలో థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది. అందుకు అనుగుణంగానే ఈ ఫిల్మ్‌కు కలెక్షన్లు నిలకడగా వచ్చాయి.

రోజుల వారిగా ఇప్పటి వరకూ ఎంత?
ఎన్నో అంచనాల నడుమ వచ్చిన 'రాజ రాజ చోర'తో శ్రీవిష్ణు బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మొదటి రోజు రూ. 57 లక్షలు, రెండో రోజు రూ. 64 లక్షలు, మూడో రోజు రూ. 76 లక్షలు, నాలుగో రోజు రూ. 80 లక్షలు, ఐదో రోజు రూ. 50 లక్షలు, ఆరో రోజు రూ. 41 లక్షలు, ఏడో రోజు రూ. 30 లక్షలతో మొత్తంగా రూ. 3.98 కోట్లు వచ్చాయి.

ఏ ప్రాంతంలో ఎంత వసూలు చేసింది?
'రాజ రాజ చోర' మూవీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లోనూ మంచి కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా ఇప్పటి వరకూ నైజాంలో రూ. 1.81 కోట్లు, సీడెడ్‌లో రూ. 57 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్‌లో రూ. 29 లక్షలు, వెస్ట్‌లో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 34 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలు వసూలు అయ్యాయి.

వారానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?
'రాజ రాజ చోర' ఏడు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.98 కోట్లు షేర్, రూ. 6.85 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 11 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 64 లక్షలు రాబట్టింది. అంటే మొత్తంగా ఈ సినిమాకు ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.73 కోట్లు షేర్, 8.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
Recommended Video

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?
శ్రీవిష్ణు నటించిన 'రాజ రాజ చోర' సినిమాకు మొత్తంగా రూ. 2.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 2.40 కోట్లుగా నిర్ణయించారు. ఇక, ఈ చిత్రానికి వారం రోజుల్లోనే రూ. 4.73 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఇప్పటికే దీనికి రూ. 2.33 కోట్లు లాభాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











