Sreekaram 2nd day collections: దారుణంగా పడిపోయిన కలెక్షన్లు.. పాజిటివ్ టాక్ ఉన్నా...

యువ హీరో శర్వానంద్, ప్రియాంకా అరుల్ మోహన్ నటించిన శ్రీకారం చిత్రం విడుదలకు ముందు సాధించిన బజ్‌ను నిలబెట్టుకోలేదనే విషయం రెండో రోజు బాక్సాఫీస్ రిపోర్టు స్పష్టం చేసింది. తొలి రోజు బెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకొన్న ఈ చిత్రం అదే ఊపును కొనసాగించలేకపోయింది. శ్రీకారం చిత్రం రెండో రోజు కలెక్షన్ల వివరాలు మీ కోసం..

 పాజిటివ్ బజ్‌తో రిలీజ్

పాజిటివ్ బజ్‌తో రిలీజ్

రైతు ప్రధానంగా వ్యవసాయం ప్రాధాన్యతను చెప్పే అంశంతో తెరకెక్కిన శ్రీకారం చిత్రం రిలీజ్‌కు ముందు భారీగా బిజినెస్‌ను సొంతం చేసుకొన్నది. ప్రమోషన్స్ భారీగా చేయడం, చిరంజీవి, రాంచరణ్ సినిమాకు సపోర్టుగా నిలవడంతో అంచనాలు పెరిగాయి. సినిమా సానుకూలమైన టాక్‌తో కొనసాగుతున్నది.

 శ్రీకారం ప్రీ రిలీజ్ బిజినెస్

శ్రీకారం ప్రీ రిలీజ్ బిజినెస్

ఇక శ్రీకారం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ట్రేడ్ అనలిస్టుల రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.17 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. నైజాం హక్కులు రూ.5.7 కోట్లకు, సీడెడ్ హక్కులు 2.4 కోట్లు, ఆంధ్రాలో 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. నైజాం, ఆంధ్రాలో మొత్తంగా 16 కోట్లకుపైగా బిజినెస్ నమోదైంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.1 కోటి మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

 రెండో రోజు 60 శాతానికిపైగా క్షీణత

రెండో రోజు 60 శాతానికిపైగా క్షీణత

ఇక శ్రీకారం తొలి రోజున భారీగానే వసూళ్లను నమోదు చేసింది. మొదటి రోజున రూ.4 కోట్లకుపైగా నికర వసూళ్లను, సుమారు రూ.6 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజున నైజాం, ఆంధ్రా సీడెడ్‌లో రూ.2.52 కోట్ల గ్రాస్ వసూళ్లను, రూ.1.48 కోట్ల నికర వసూళ్లను వసూలు చేసింది. అంటే తొలి రోజుతో పోల్చుకొంటే 60 శాతానికి పైగా వసూళ్లు క్షీణించాయి.

 రెండో రోజు కలెక్షన్లు ఇలా

రెండో రోజు కలెక్షన్లు ఇలా

ఇక రెండో రోజున ఏరియాల వారీగా కలెక్షన్లను చూసుకొంటే.. నైజాంలో రూ.61 లక్షలు, సీడెడ్‌లో రూ.28 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.22 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.10 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7 లక్షలు, గుంటూరులో రూ.7.6 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.6.4 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ.6 లక్షల వసూళ్లను సాధించింది.

శ్రీకారం రెండు రోజులు వసూళ్లు

శ్రీకారం రెండు రోజులు వసూళ్లు

మొత్తంగా నైజాం, ఆంధ్రాలో ఏరియాల వారీగా శ్రీకారం రెండు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే.. నైజాంలో రూ.1.69 కోట్లు, సీడెడ్‌లో రూ.1 కోటి, ఉత్తరాంధ్రలో రూ.76 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.54 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.34 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.73 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.29 లక్షలు, నెల్లూరులో రూ.20 లక్షలు వసూలు చేసింది.

 ప్రపంచవ్యాప్తంగా రాబడి

ప్రపంచవ్యాప్తంగా రాబడి

గత రెండు రోజుల్లో నైజాం, ఏపీలో వసూళ్లను పరిశీలిస్తే.. రూ.5.55 కోట్ల నికర వసూళ్లను, రూ.9.37 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.18 లక్షలు, ఓవర్సీస్‌లో 25 లక్షలు వసూలు చేసింది. రెండు రోజుల్లో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.5.98 నికర వసూళ్లను, 10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే ఇంకా 11 కోట్ల మేర వసూళ్లను సొంతం చేసుకోవాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X