twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sreekaram 4th day collections: శర్వానంద్ మూవీపై కోలుకోలేని దెబ్బ.. బాక్సాఫీస్ వద్ద ధీనంగా

    |

    దేశానికి రైతు వెన్నుముక అనే సందేశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీకారం చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడినట్టు కనిపిస్తుంది. భారీగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను నమోదు చేసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొన్నప్పటికీ.. వసూళ్ల పరంగా సత్తా చాటలేకపోతున్నది. శర్వానంద్ నటించిన ఈ చిత్రం 4వ రోజున ఎంత వసూలు చేసిందంటే..

    శాకుంతలగా సమంత అక్కినేని.. గుణశేఖర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం

    చిరంజీవి, కేటీఆర్ అండగా

    చిరంజీవి, కేటీఆర్ అండగా

    శ్రీకారం చిత్రానికి ప్రముఖులంతా అండగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రి కేటీఆర్ సినిమా ప్రమోషన్‌ వేడుకల్లో పాల్గొని తమ వంతు సహకారం అందించారు. దాంతో ప్రమోషన్ ఊపందుకొన్నట్టు కనిపించింది. ఆ తర్వాత శ్రీకారం సినిమాకు పెద్దగా ప్రమోషన్ జరిగినట్టు కనిపించలేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అంతగా జరగలేదంటూ గుసగుసలు వినిపించాయి.

    జాతి రత్నాలు దెబ్బతో

    జాతి రత్నాలు దెబ్బతో

    ఇక శ్రీకారం సినిమాకు భారీగా జాతి రత్నాలు పోటీ ఇవ్వడం మైనస్‌గా మారింది. జాతి రత్నాలు సినిమాకు మొదటి నుంచి మంచి ప్రమోషన్ లభించడం పాజిటివ్‌గా మారింది. యూత్‌కు జాతి రత్నాలు సినిమా చేరువ కావడంతో శ్రీకారం కలెక్షన్లపై దెబ్బ పడిందనే మరో వాదన వినిపించింది. దాంతో కర్ణుడి చావుకు రకరకాల కారణాలు అనే విధంగా శ్రీకారం సినిమాకు పలు విషయాలు ప్రతికూలంగా మారాయి.

    శశి ప్రీరిలీజ్ ఈవెంట్: రానా దగ్గుబాటి, నాగ శౌర్య , సందీప్ కిషన్ హాజరు (ఫొటోలు)

    నాలుగో రోజు కలెక్షన్లు

    నాలుగో రోజు కలెక్షన్లు

    శ్రీకారం సినిమా నాలుగో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 31 లక్షలు, సీడెడ్‌లో రూ.15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.12 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 11 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 లక్షలు, గుంటూరులో రూ. 9.2 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.8 లక్షలు, నెల్లూరులో రూ.4 లక్షలు, వసూలు చేసింది.

    యూఎస్‌లో అంతంత మాత్రంగానే

    యూఎస్‌లో అంతంత మాత్రంగానే

    ఇక అమెరికాలో శ్రీకారం వసూళ్ల పరిస్థితి చూస్తే.. ప్రీమియర్ల ద్వారా రూ.15178 డాలర్లు, తొలి రోజున 10 వేల డాలర్లు, రెండో రోజు 20548, మూడో రోజు 27466 డాలర్లు రాబట్టింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 73200 డాలర్లు అంటే 53 లక్షలు రూపాయలను వసూలు చేసింది.

    మహేష్ బాబు థియేటర్ లో ముగ్గురు జాతిరత్నాలు సందడి: రచ్చరచ్చ చేశారు (ఫొటోలు)

    శ్రీకారం లాభాల్లోకి రావాలంటే...

    శ్రీకారం లాభాల్లోకి రావాలంటే...

    ఇక నాలుగో రోజు 96 లక్షల నికర, 1.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లను శ్రీకారం చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. గత మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ.757 కోట్ల నికర, 12.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో 22 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.53 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే సుమారు మరో 9 కోట్లకుపైగా రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 17 కోట్లకుపైగానే జరిగింది.

    English summary
    Tollywood Hero Sharwanand's Sreekaaram film directed by Kishore Reddy and produced by Ram Achanta and Gopichand Achanta under 14 Reels Plus. This movie registered 17 crores pre release business world wide. But second day of its release, Movie collections droped over 60 percent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X