twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sreekaram 8 days collections: ప్లాన్ మొత్తం రివర్స్.. ఆ స్థాయిలో నష్టాలు తప్పేలా లేవు!

    |

    సినిమా బావుంటే పాజిటివ్ టాక్ ద్వారా కలెక్షన్స్ ఈజీగా వచ్చేస్తాయని నిర్మాతలు ఎంతో ఆలోచించి భారీ స్థాయిలో ఖర్చు పెడతారు. ఈ రోజుల్లో నాన్ థియేట్రికల్ బిజినెస్ అనేది ఒకటి బావుంది కాబట్టి డిజాస్టర్ సినిమాల నిర్మాతలు ఎంతో కొంత నిలదొక్కుకుంటున్నారు. ఇక శ్రీకారం సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్స్ అందుకుంటోంది. ఇక 8రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే..

    జాతి రత్నాలు సక్సెస్ మీట్: నవీన్ పోలిశెట్టి హ్యాపీ (ఫొటోలు)

    ప్లాన్ మొత్తం రివర్స్

    ప్లాన్ మొత్తం రివర్స్

    మంచి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శర్వా శ్రీకారం సినిమాతో కూడా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద హిట్ కొడతాడాని అందరూ అనుకున్నారు. కానీ హీరోకు ఊహించని షాక్ ఎదురైంది. శ్రీకారం సినిమా బాక్సాఫీస్ వద్ద తక్కువ కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. అతని కెరీర్ లోనే ఈ సినిమా మరో మార్క్ ఫిల్మ్ గా నిలుస్తుందని అనుకుంటే ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది.

    రివ్యూలు చాలా పాజిటివ్ గా

    రివ్యూలు చాలా పాజిటివ్ గా

    నిజానికి శ్రీకారం సినిమాకు పెద్దగా నెగిటివ్ టాక్ ఏమి రాలేదు. రివ్యూలు కూడా చాలా పాజిటివ్ గా వచ్చాయి. పైగా మొదటి రోజే సినిమా 4కోట్లకు పైగా షేర్స్ అందుకోవడంతో హిట్టు గ్యారెంటీ అనే టాక్ వచ్చింది. కానీ సెకండ్ డే నుంచి అసలైన దెబ్బ పడింది. షేర్స్ కోటికి పడుపోతూ వచ్చాయి. వీకెండ్ తరువాత మరింత తగ్గాయి.

    8వ రోజు వచ్చిన షేర్స్

    8వ రోజు వచ్చిన షేర్స్

    శ్రీకారం సినిమాకు 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం 4లక్షలు, సీడెడ్ 3లక్షలు, ఉత్తరాంధ్ర 2లక్షలు, ఈస్ట్ 1.2లక్షలు, వెస్ట్ 0.4లక్షలు, గుంటూరు 1.2లక్షలు, కృష్ణ 1.6లక్షలు, నెల్లూరు 0.4లక్షలు.. తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్ 0.14కోట్లు. గ్రాస్ 0.25కోట్లు

    8రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్

    8రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్

    ఫస్ట్ డే సినిమాకు 4కోట్లకు పైగా షేర్స్ రాగా రెండవ రోజు నుంచి తగ్గుతూ వచ్చాయి. టికెట్ల రేట్లు పెంచిన విషయం తెలిసిందే. 5వ రోజు అయితే 30లక్షలకు పడిపోవడం షాకింగ్ అనే చెప్పాలి. ఆంద్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటివరకు సినిమా 8.58కోట్ల వరకు షేర్స్ వచ్చాయి. గ్రాస్ కలెక్షన్స్ 14.45కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీకారం సినిమా 8 రోజుల్లో 9.30కోట్ల షేర్స్ ను రాబట్టింది. ఇక గ్రాస్ కలెక్షన్స్ 15.80కోట్లు వచ్చాయి.

    నష్టాలు తప్పేలా లేవు..

    నష్టాలు తప్పేలా లేవు..

    శ్రీకారం సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ టోటల్ గా 17.5కోట్లు. కానీ ప్రస్తుతం లక్షల్లో షేర్స్ అందుకుంటున్న ఈ సినిమా ఇంకా 8.20కోట్ల వరకు అందుకోవాల్సి ఉంది. మళ్ళీ కోట్లల్లో షేర్స్ అందుకుంటేనే ప్రాఫిట్స్ లోకి వస్తుంది. వీకెండ్స్ లోనే షేర్స్ దారుణంగా పడిపోయాయి. ఇక ఈ శుక్రవారం మూడు ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చేశాయి. దీంతో 7కోట్లకు పైగా నష్టాలు తప్పేలా లేవని తెలుస్తోంది. మరి ఆ సినిమాల నుంచి పోటీ ఎంతవరకు ఉంటుందో చూడాలి.

    English summary
    Sharwanand, a young hero who has earned a special recognition for himself with his feel good films, this time impressed a section of the audience with his film Srikaram. The film, which is based on agriculture, was released on Thursday. The collections for the first day movie were decent. Sharwanand also got good openings with his stardom in two other films as a competition.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X