Skanda Non Theatrical Business రామ్ పోతినేని క్రేజ్ ఓ రేంజ్‌లో .. కళ్లుచెదిరేలా స్కంధ పాన్ ఇండియా బిజినెస్!

ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల జంటగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం స్కంధ. పవర్‌ఫుల్ యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత సినిమాకు భారీ బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, ఇతర వివరాల్లోకి వెళితే..

Sreeleela and Ram Pothinenis Skanda movie digital, satellite rights sold for 98 crores in India

నార్త్ ఇండియాలో రామ్ క్రేజ్: రామ్ పోతినేనికి స్కంధ చిత్రం తొలి పాన్ ఇండియా మూవీ. ఇప్పటి వరకు రామ్ నటించిన సినిమాలు హిందీలో డబ్ అయి రికార్డు వ్యూస్ సాధించాయి. ఉత్తర భారత్‌తో రామ్ నటించిన డబ్బింగ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. యూట్యూబ్‌లో రామ్ పోతినేని సినిమాలకు యమ క్రేజ్ లభించడంతో తెలిసిందే. దాంతో స్కంధ సినిమాకు ఉత్తరాదితోపాటు అన్ని ప్రాంతాల్లో కూడా భారీ స్పందన లభిస్తున్నది.

Sreeleela and Ram Pothinenis Skanda movie digital, satellite rights sold for 98 crores in India

స్కంధ ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్: స్కంధ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేసిన ట్రైలర్‌కు అనుహ్యమైన స్పందన లభించింది. ట్రైలర్‌లో రామ్, శ్రీలీల మధ్య కనిపించిన కెమిస్ట్రీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. రామ్‌తో బోయపాటి చేయించిన యాక్షన్ సీన్లు మాస్ ఆడియెన్స్ కిర్రాక్ అనిపించేలా ఉన్నాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Sreeleela and Ram Pothinenis Skanda movie digital, satellite rights sold for 98 crores in India

రామ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బిజినెస్: ఇక స్కంధ సినిమాకు వస్తున్న క్రేజ్‌తో బిజినెస్ కూడా భారీగా జరిగింది. రామ్ కెరీర్‌లో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రికార్డు బిజినెస్ జరిగింది. స్కంధ నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ 98 కోట్ల రూపాయలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రామ్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ బిజినెస్ కావడం విశేషంగా మారింది.

దక్షిణాదిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు: స్కంధ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ ఏరియాల వారీ వివరాల్లోకి వెళితే.. దక్షిణాది భాషల శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులకు భారీ రేటు పెరిగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన శాటిలైట్, డిజిటల్ రైట్స్‌కు 54 కోట్ల రూపాయల రేటుకు స్టార్ టెలివిజన్ గ్రూప్ సొంతం చేసుకొన్నది.

Sreeleela and Ram Pothinenis Skanda movie digital, satellite rights sold for 98 crores in India

రామ్ పోతినేని మూవీకి నార్త్‌లో థియేట్రికల్ బిజినెస్: ఇక ఉత్తరాదిలో రామ్ పోతినేనికి ఉన్న క్రేజ్‌తో హిందీలో కూడా భారీ బిజినెస్ జరిగింది. శాటిలైట్, ఓటీటీ, థియేట్రికల్ రైట్స్‌కు భారీగా రేటు పలికింది. హిందీ భాషకు సంబంధించిన శాటిలైట్, ఓటీటీ, థియేట్రికల్ రైట్స్‌కు 35 కోట్ల రూపాయలు చెల్లించి ప్రముఖ సంస్థ చేజిక్కించుకొన్నది. ప్రస్తుతం ఓ తెలుగు హీరోకు పాన్ ఇండియా స్థాయిలో ఈ రేంజ్ బిజినెస్ జరగడంతో బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X