Bhagvanth Kesari Collections 100 కోట్లకు చేరువగా బాలకృష్ణ భగవంత్ కేసరి.. బాక్సాఫీస్ వద్దఓ రేంజ్‌లో శ్రీలీల

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల, అందాల భామ కాజల్ అగర్వాల్ నటించిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే సక్సెస్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా తొలి రోజు భారీ కలెక్షన్లు సాధించిన తర్వాత రెండో రోజు వసూళ్ల పరిస్థితి ఎలా ఉందంటే?

భగవంత్ కేసరి చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు, హీరోయిన్లు ఉండటంతో బడ్జెట్ భారీగా పెరిగింది. ఈ సినిమాను 100 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు 70 కోట్ల రూపాయల మేర భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో హాట్ కేక్‌లా బిజినెస్ జరిగింది.

Sreeleelas Bhagvanth Kesari day 2 expected Collections worldwide: Balakrishna movie rampage at box office

ప్రపంచవ్యాప్తంగా భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాంలో 15 కోట్లు, సీడెడ్‌లో 13 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కోట్లు, గుంటూరు 6 కోట్లు రూపాయలు, కృష్ణా జిల్లాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 2.6 కోట్ల రూపాయాలతో బిజినెస్ జరిగింది. మొత్తంగా ఏపీ, నైజాంలో కలిపి 58 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 4.5 కోట్లు, ఓవర్సీస్‌లో 6 కోట్ల రూపాయల బిజినెస్‌తో మొత్తంగా 70 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.

Sreeleelas Bhagvanth Kesari day 2 expected Collections worldwide: Balakrishna movie rampage at box office

భగవంత్ కేసరి సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. నైజాంలో 300 స్క్రీన్లు, సీడెడ్‌లో 200 స్క్రీన్లు, ఆంధ్రాలో 400 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 900 స్క్రీన్లకుపైగా ప్రదర్శిస్తున్నారు కర్ణాటక, ఇతర రాస్ట్రాల్లో 100 స్క్రీన్లకుపైగా, ఓవర్సీస్‌లో 350 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.

Sreeleelas Bhagvanth Kesari day 2 expected Collections worldwide: Balakrishna movie rampage at box office

భగవంత్ కేసరి చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఆంధ్రాలో 8.7 కోట్లు, సీడెడ్‌లో 4 కోట్లు, నైజాంలో 4.9 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో 20 కోట్ల షేర్, 24 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 8.15 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 42 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

Sreeleelas Bhagvanth Kesari day 2 expected Collections worldwide: Balakrishna movie rampage at box office

భగవంత్ కేసరి చిత్రం రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. అమెరికాలో 700k డాలర్లు అంటే.. 5.8 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల షేర్, 14 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ఓవరాల్‌గా రెండు రోజుల్లో 60 కోట్ల రూపాయలకు చేరువయ్యే అవకాశం ఉందని ట్రడే్ వర్గాలు వెల్లడించాయి.

భగవంత్ కేసరి సినిమా దాదాపు 70 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల వరకు గ్రాస్.. 35 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా దాదాపు 50 శాతం బిజినెస్ అమౌంట్ రాబట్టింది. తొలివారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X