శ్రీకృష్ణ యావరేజి, కితకితలు స్పీడ్
ఈ వారం రెండు డబ్బింగ్ సినిమాలు ధూల్‌పేట జలకంఠ సినిమాలు బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్నాయి. హైదరాబాద్ లోని కొన్ని ధియేటర్లలో రెండు మూడు రోజుల తర్వాత ధూల్‌పేట కొన్ని డజన్ల మందిని కూడా ఆకర్షించకపోవడం ఆ సినిమా భవిష్యత్తును చెప్పకనే చెబుతోంది. రజనీకాంత్ అల్లుడు ధనుష్ బయ్యర్లను, ప్రేక్షకులను బెంబేలెత్తించడం తెలుగులో వరుసగా ఇది రెండో సారి. తమిళంలో శింబు నటించిన తొట్టిజయ డబ్బింగ్ అయిన జలకంఠ నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో విడుదలైంది. పబ్లిసిటీ, ప్రాంతీయత లోపం కారణంగా ఈ సినిమా కుంటినడక నడుస్తోంది. డి. రామానాయుడు విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన శ్రీకృష్ణ-2006కు యావరేజి టాక్ వచ్చింది. చిన్న సినిమాల సెగ్మెంట్‌లో అత్యధిక సినిమాలు ఫట్‌మనడంతో ఇవివి కితకితలు బాక్సాఫీసు వద్ద అనూహ్యంగా పుంజుకుంది.


Click it and Unblock the Notifications