'శ్రీరామరాజ్యం'చిత్రంకు అమెరికాలో..

By Srikanya

బాపు,బాలకృష్ణ ల కాంబినేషన్ లో రూపొందిన పౌరాణిక చిత్రం శ్రీరామరాజ్యానకి ప్రవాసాంధ్రుల నుంచి మంచి ఆదరణే లభిస్తోంది.ముఖ్యంగా అమెరికాలో శ్రీరామ రాజ్యం చిత్రం చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారని తెలుస్తోంది.అందుకు తగినట్లుగా ఓ ఎన్నారై ఐదు వేల డాలర్లు పెట్టి ఈ చిత్రం టిక్కెట్ కొని తన అభిమానం చాటుకున్నారు.మరో ప్రక్క కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణు తో కలిసి ఈ చిత్రాన్ని చూసారు.మోహన్ బాబుకు అక్కడి తెలుగు వారు ఘన స్వాగతం పలికారు.

ధియోటర్ల వద్ద ఏర్పాటు చేసిన సీతారాముల విగ్రహాలకు మోహన్ బాబు పూజలు నిర్వహించి అనంతరం సినిమాను వీక్షించారు. ఇక ఆంధ్రాలో ఈ చిత్రం పరిస్దితి చూస్తే వీకెండ్ వరకూ కలెక్షన్స్ నిలకడగానే ఉన్నాయి.అయితే కొన్ని సెంటర్లలో మాత్రం కలెక్షన్స్ శుక్రవారం డ్రాప్ అయ్యాయి.కుటుంబాలను ఈ చిత్రం ఆకట్టుకోవటం ప్లస్ అయ్యిందంటున్నారు విశ్లేషకులు.లవకుశ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో పాటలు మైనస్ కావటంతో కొందరిని నిరాశపరిచింది.అయినా చాలా గ్యాప్ తర్వాత వచ్చిన భక్తి రస చిత్రం కావటంతో ఈ సినిమాకై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే ఈ తరం యువత మాత్రం ఈ చిత్రంపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు.అందుకు నిదర్శనం..ధియోటర్స్ వద్ద పలచగా ఉన్న కాలేజీ యువతే అంటున్నారు ఎగ్జిబిటర్స్.ఈ వారాంతానికి పూర్తి స్ధాయి ఈ చిత్రం పరిస్ధితి తెలుస్తుంది.అయితే ఇతరదేశాల్లో ఈ చిత్రం రైట్స్ తీసుకున్నవారు మాత్రం తమ పంట పండినట్లుగానే భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X