'శ్రీరామ రాజ్యం'చిత్రం కలెక్షన్స్ పొజీషన్?
బాపు, బాలకృష్ణల కాంబినేషన్ లో వచ్చిన పౌరాణిక చిత్రం శ్రీరామ రాజ్యం.ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ తో విడుదైలైంది.దాదాపు చాలా చోట్ల 75 నుంచి 95 శాతం వరకూ సీట్స్ ఆక్యుపెన్సీ విడుదల రోజు జరిగింది.దాదాపు 32 కోట్ల బడ్జెట్ తో నిర్మింపబడ్డ ఈ చిత్రం మొదటి రోజు 5.14 వసూలు చేసింది.అయితే బాలకృష్ణ చిత్రాలతో పోలిస్తే ఇది పెద్ద మొత్తం కాకపోయినా ఓకే అనిపించుకుంది.అయితే ఆ హవా వీకెండ్ లో కూడా నడిచింది.
ఫ్యామిలీలు ఈ చిత్రాన్ని చూడటానికి రావటం జరిగింది.అయితే కీలకమైన అంశం ఈ రోజు అంటే సోమవారం నుంచే అనేది నిజం.ఈ రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవకుండా నిలబడితే చిత్రం హిట్టైయినట్లే.ఇక ఈ చిత్రం ప్రమోషన్ ని కూడా నిర్మాతలు పెంచాలని నిర్ణయించారు.పౌరాణిక చిత్రం కాబట్టి యువతను పెద్దగా ఆకర్షించలేకపోతోందని ఎగ్జిబిటర్స్ అంటున్నారు.
మరో ప్రక్క లవకుశతో పోల్చి చూసి పెదవి విరుస్తున్నారు కొంతమంది,ఆడియో వీక్ గా ఉండటం కూడా ఈ సినిమాకు మైనస్ అయినా బాపు,రమణల చిత్రం,బాలకృష్ణ ప్రధాన పాత్ర కావటం వాటిన్నటినీ దాటగలగుతోంది.ఈ వారాంతానకి కానీ ఈ సినిమా పొజీషన్ ఏమిటనేది ఖచ్చితంగా తెలియదు.సినిమా చూసిన వారంతా నయనతార పాత్రకే పట్టం కడుతున్నారు.సీతా దేవిగా ఆమె ఊహించని విధంగా,ఎవరూ వంకపెట్టలేని విధంగా ఇమిడిపోయిందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











