Mathu Vadalara 2 Movie 10 Days Collections: సింహా, సత్య మ్యాజిక్.. ఏకంగా అన్ని కోట్లు.. లాభం చూశారంటే!

తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు కామెడీ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికితోడు కొన్ని ట్విస్టులు, టర్న్‌లతో సాగే చిత్రాలూ రూపొందుతోన్నాయి. వీటన్నింటి కలయికలో రూపొందిన సినిమానే 'మత్తు వదలరా 2'. గతంలో వచ్చిన మొదటి భాగం ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు రెండో పార్ట్ కూడా ఆరంభంలోనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో భారీ వసూళ్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శ్రీ సింహా కోడూరి 'మత్తు వదలరా 2' సినిమా 10 రోజుల్లో ఎంత కలెక్షన్లను అందుకుందో మీరే చూసేయండి మరి!

ఫన్నీగా మత్తు వదలరా 2
శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన సినిమానే 'మత్తు వదలరా 2'. రితేష్ రానా తీసిన ఈ మూవీని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు, హేమలత పెద్దమల్లు నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేయగా.. సత్య కీలక పాత్రలో నటించాడు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. వెన్నెల కిశోర్, సునీల్ నటించారు.

Sri Simha Koduri Starrer Mathu Vadalara 2 Movie 10 Days Official Box Office Collections

ఈ మూవీకి బిజినెస్ ఇలా

'మత్తు వదలరా' సినిమా గతంలో వచ్చి ప్రేక్షకులను నవ్వించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'మత్తు వదలరా 2' మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 8.00 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

10వ రోజు ఎంత వచ్చింది
రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన 'మత్తు వదలరా 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన భారీగానే వస్తోంది. మధ్యలో కాస్త డౌన్ అయినప్పటికీ రెండో వీకెండ్‌లో ఇది మళ్లీ పుంజుకుంది. దీంతో 10వ రోజైన ఆదివారం ఈ సినిమా భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 92 లక్షలు షేర్ వసూలు చేసి సత్తా చాటుకుంది.

Sri Simha Koduri Starrer Mathu Vadalara 2 Movie 10 Days Official Box Office Collections

10 రోజులకు కలిపి ఎంత?

ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మత్తు వదలరా 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయేలా రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో 10 రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా రూ. 5.12 కోట్లు వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 4.38 కోట్లు రాబట్టింది. ఇలా ఈ చిత్రం పది రోజుల్లోనే రూ. 9.50 కోట్లు షేర్, రూ. 17.40 కోట్లు గ్రాస్ వసూలు చేసి దుమ్ములేపింది.

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే
శ్రీ సింహా కోడూరి, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన 'మత్తు వదలరా 2' సినిమాకు వరల్డ్ వైడ్‌గానూ భారీ రెస్పాన్సే వస్తోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో ఇది రూ. 1.16 కోట్లు షేర్ రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ. 4.02 కోట్లు రాబట్టింది. ఇలా పది రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.68 కోట్లు షేర్‌తో పాటు రూ. 29.90 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

Sri Simha Koduri Starrer Mathu Vadalara 2 Movie 10 Days Official Box Office Collections

టార్గెట్‌ ఔట్.. లాభం ఇలా

శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన 'మత్తు వదలరా 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 8.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది. అలాంటిది 10 రోజుల్లో దీనికి రూ. 14.68 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.10 కోట్లు లాభాలతో రికార్డు కొట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X