Mathu Vadalara 2 Movie 11 Days Collections: ఇటు 15 అటు 30 కోట్లు ఔట్.. మత్తు వదలరా 2కు లాభం ఎంతంటే!
టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే హిట్లు కొడుతుండగా.. మిగిలిన వాళ్లు సరైన సక్సెస్ కోసం చూస్తున్నారు. అలాంటి వారిలో శ్రీ సింహా కోడూరి ఒకరు. కెరీర్‌లో భారీ విజయం కోసం ఎదురు చూస్తోన్న అతడు ఇటీవలే 'మత్తు వదలరా 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలోనే లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'మత్తు వదలరా 2' సినిమా 11 రోజుల్లో ఎంత కలెక్షన్లను అందుకుందో మీరే చూడండి!
ఫన్ స్టోరీతో వచ్చేసిందిగా
శ్రీ సింహా కోడూరి నటించిన కామెడీ చిత్రమే 'మత్తు వదలరా 2'. రితేష్ రానా తీసిన ఈ మూవీని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు, హేమలత పెద్దమల్లు నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేయగా.. సత్య కీలక పాత్రలో నటించాడు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. వెన్నెల కిశోర్, సునీల్ కీలక పాత్రలు చేశారు.

ఈ మూవీకి బిజినెస్ ఇలా
'మత్తు వదలరా' కమర్షియల్‌గా సక్సెస్ కాకున్నా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'మత్తు వదలరా 2' మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 8.00 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
11వ రోజు ఎంత వచ్చింది
రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా కోడూరి నటించిన 'మత్తు వదలరా 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన భారీగానే వస్తోంది. మధ్యలో కాస్త డౌన్ అయినప్పటికీ రెండో వీకెండ్‌లో ఇది పుంజుకుంది. కానీ 11వ రోజు వర్కింగ్ డే కావడంతో ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కేవలం రూ. 26 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసుకుంది.

11 రోజులకు కలిపి ఎంత?
పూర్తి స్థాయి కామెడీ స్టోరీతో రూపొందిన 'మత్తు వదలరా 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయేలా రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో 11 రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా రూ. 5.26 కోట్లు వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 4.50 కోట్లు రాబట్టింది. ఇలా ఈ చిత్రం 11 రోజుల్లోనే రూ. 9.76 కోట్లు షేర్, రూ. 17.90 కోట్లు గ్రాస్ వసూలు చేసి దుమ్ములేపింది.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే
శ్రీ సింహా కోడూరి, సత్య ప్రధాన పాత్రల్లో అలరించిన 'మత్తు వదలరా 2' సినిమాకు వరల్డ్ వైడ్‌గానూ భారీ రెస్పాన్సే వస్తోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో ఇది రూ. 1.19 కోట్లు షేర్ రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ. 4.08 కోట్లు రాబట్టింది. ఇలా 11 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.03 కోట్లు షేర్‌తో పాటు రూ. 30.65 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఔట్.. లాభం ఇలా
శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన 'మత్తు వదలరా 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 8.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది. అలాంటిది 11 రోజుల్లో దీనికి రూ. 15.03 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.53 కోట్లు లాభాలతో రికార్డు కొట్టింది.


Click it and Unblock the Notifications











