Mathu Vadalara 2 Movie 12 Days Collections: కీరవాణి కొడుక్కి జాక్‌పాట్.. ఎన్ని కోట్లు కొట్టాడో తెలిస్తే!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది హీరోలుగా వస్తున్నారు. కానీ, వారిలో అతి తక్కువ మంది మాత్రమే విజయాల బాటలో వెళ్తుండగా.. మిగిలిన వాళ్లంతా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో శ్రీ సింహా కోడూరి ఒకరు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న అతడు.. ఇటీవలే 'మత్తు వదలరా 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలోనే దక్కుతోంది. ఈ నేపథ్యంలో 'మత్తు వదలరా 2' సినిమా 12 రోజుల్లో ఎంత కలెక్షన్లను సాధించిందో మీరే చూడండి!
సింహా, సత్య కామెడీతోనే
శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన సినిమానే 'మత్తు వదలరా 2'. రితేష్ రానా తీసిన ఈ మూవీని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు, హేమలత పెద్దమల్లు నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేయగా.. సత్య కీలక పాత్రలో నటించాడు. వెన్నెల కిశోర్, సునీల్ కీలక పాత్రలు చేశారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు.

ఈ మూవీకి బిజినెస్ ఇలా
'మత్తు వదలరా' మూవీతో ప్రేక్షకులను అలరించిన శ్రీ సింహా.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'మత్తు వదలరా 2' చేశాడు. దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 8.00 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
12వ రోజు ఎంత వచ్చింది
థ్రిల్‌కు గురి చేసే కామెడీ కథతో రూపొందిన 'మత్తు వదలరా 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన భారీగానే వస్తోంది. మధ్యలో కాస్త డౌన్ అయినప్పటికీ రెండో వీకెండ్‌లో ఇది పుంజుకుంది. కానీ 12వ రోజు వర్కింగ్ డే కావడంతో మళ్లీ డౌన్ అయిపోయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కేవలం రూ. 23 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసుకుంది.

12 రోజులకు కలిపి ఎంత?
రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా చేసిన 'మత్తు వదలరా 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయేలా రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో 12 రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా రూ. 5.35 కోట్లు వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 4.64 కోట్లు రాబట్టింది. ఇలా ఈ చిత్రం 12 రోజుల్లోనే రూ. 9.99 కోట్లు షేర్, రూ. 18.35 కోట్లు గ్రాస్ వసూలు చేసి దుమ్ములేపింది.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే
శ్రీ సింహా కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో చేసిన 'మత్తు వదలరా 2' సినిమాకు వరల్డ్ వైడ్‌గానూ భారీ రెస్పాన్సే వస్తోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో ఇది రూ. 1.21 కోట్లు షేర్ రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ. 4.15 కోట్లు రాబట్టింది. ఇలా 12 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.35 కోట్లు షేర్‌తో పాటు రూ. 31.35 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఔట్.. లాభం ఇలా
శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన 'మత్తు వదలరా 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 8.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది. అలాంటిది 12 రోజుల్లో దీనికి రూ. 15.35 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.85 కోట్లు లాభాలతో రికార్డు కొట్టింది.


Click it and Unblock the Notifications











