Mathu Vadalara 2 Movie 14 Days Collections: 8.50 కోట్లు రావాలి.. ఊహించని వసూళ్లతో.. అసలు లెక్కలు చూస్తే!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో సీక్వెల్ మూవీలు ఎక్కువగా రూపొందుతోన్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ఆరంభంలోనే హైప్ క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్నాయి. అలాంటి సినిమాల్లో 'మత్తు వదలరా 2' ఒకటి. గతంలో వచ్చి క్రేజీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న 'మత్తు వదలరా' మూవీకి ఇది కొనసాగింపుగా రూపొందింది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి 'మత్తు వదలరా 2' సినిమా 14 రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి!
ఫుల్ ఫన్‌తో వచ్చిన మూవీ
శ్రీ సింహా కోడూరి హీరోగా, సత్య మరో ప్రధాన పాత్రలో నటించిన సినిమానే 'మత్తు వదలరా 2'. రితేష్ రానా తీసిన ఈ మూవీని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు, హేమలత పెద్దమల్లు నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేయగా.. వెన్నెల కిశోర్, సునీల్ కీలక పాత్రలు చేశారు. దీనికి కాల భైరవ సంగీతం ఇచ్చాడు.

ఈ మూవీకి బిజినెస్ ఇలా
'మత్తు వదలరా' మూవీతో ఆడియెన్స్‌ను ఫిదా చేసిన శ్రీ సింహా.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'మత్తు వదలరా 2' చేశాడు. దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 8.00 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.
14వ రోజు ఎంత వచ్చింది
కామెడీ కథతో థ్రిల్‌కు గురి చేసే కంటెంట్‌తో రూపొందిన 'మత్తు వదలరా 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన భారీగానే వస్తోంది. మధ్యలో కాస్త డౌన్ అయినప్పటికీ రెండో వీకెండ్‌లో ఇది పుంజుకుంది. కానీ, 14వ రోజు వర్కింగ్ డే కావడంతో ఈ సినిమా మళ్లీ పడిపోయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కేవలం రూ. 14 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసుకుంది.

14 రోజులకు కలిపి ఎంత?
రితేష్ రానా డైరెక్షన్‌లో శ్రీ సింహా హీరోగా చేసిన 'మత్తు వదలరా 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయేలా రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో 14 రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా రూ. 5.53 కోట్లు వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 4.78 కోట్లు రాబట్టింది. ఇలా ఈ చిత్రం 14 రోజుల్లోనే రూ. 10.31 కోట్లు షేర్, రూ. 19.00 కోట్లు గ్రాస్ వసూలు చేసి దుమ్ములేపింది.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే
శ్రీ సింహా కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో చేసిన 'మత్తు వదలరా 2' సినిమాకు వరల్డ్ వైడ్‌గానూ భారీ రెస్పాన్సే వస్తోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో ఇది రూ. 1.26 కోట్లు షేర్ రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ. 4.22 కోట్లు రాబట్టింది. ఇలా 14 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.79 కోట్లు షేర్‌తో పాటు రూ. 32.30 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఔట్.. లాభం ఇలా
శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన 'మత్తు వదలరా 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 8.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది. అలాంటిది 14 రోజుల్లో దీనికి రూ. 15.79 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 7.29 కోట్లు లాభాలతో సత్తా చాటింది.


Click it and Unblock the Notifications











