Mathu Vadalara 2 Movie 7 Days Collections: 8.50 కోట్లు రావాలి.. వారంలో వసూళ్ల సునామీ.. మొత్తం లాభం ఎంతంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఈ మధ్య కాలంలోనే చాలా మంది స్టార్ల వారసులు పరిచయం అయ్యాడు. అయితే, అలాంటి వారిలో కొందరు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. కానీ, కొందరు మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా సక్సెస్‌ను మాత్రం ఖాతాలో వేసుకోవట్లేదు. అలాంటి వారిలో కీరవాణి కుమారుడు శ్రీ సింహా కోడూరి ఒకడు. ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న లక్ష్యంతో అతడు చేసిన చిత్రమే 'మత్తు వదలరా 2'. ఫన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి మొదటి వారంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయో మీరే చూసేయండి మరి!
క్రేజీ సినిమాకు సీక్వెల్‌గా
శ్రీ సింహా కోడూరి హీరోగా రితేష్ రానా తెరకెక్కించిన చిత్రమే 'మత్తు వదలరా 2'. ఈ సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు, హేమలత పెద్దమల్లు నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేయగా.. సత్య కీలక పాత్రలో నటించాడు. అలాగే, వెన్నెల కిశోర్, సునీల్ నటించారు. ఈ మూవీకి కాల భైరవ మ్యూజిక్ ఇచ్చాడు.

ఈ మూవీకి బిజినెస్ ఇలా
గతంలో వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందిన 'మత్తు వదలరా' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిందే 'మత్తు వదలరా 2'. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 8.00 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
7వ రోజు ఇలా.. మొత్తంగా
రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా కోడూరి తెరకెక్కించిన 'మత్తు వదలరా 2' సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే దీనికి రెస్పాన్స్ కూడా లభించింది. అయితే, వీక్ డేస్‌లో ఈ చిత్రం క్రమంగా డౌన్ అవుతోంది. ఇలా ఏడో రోజు ఇది తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 లక్షలు, వరల్డ్ వైడ్‌గా రూ. 55 లక్షలు రాబట్టింది. ఇలా వారంలోనే 11 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.


Click it and Unblock the Notifications











