Mathu Vadalara 2 Movie 9 Days Collections: కుమ్మేసిన సింహా.. 9 రోజుల్లో కోట్ల వర్షం.. లాభాలతో రికార్డు
టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోలు వస్తున్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే డిఫరెంట్ మూవీలతో ప్రయోగాలు చేస్తున్నారు. అయినా చాలా మంది హిట్లను అందుకోవడం లేదు. అలాంటి వారిలో శ్రీ సింహా కోడూరి ఒకడు. ఫస్ట్ మూవీ నుంచే వైవిధ్యాన్ని ప్రదర్శిస్తోన్న అతడు అంతగా సక్సెస్ కావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే అతడు 'మత్తు వదలరా 2' అనే సినిమాతో వచ్చాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. మరి ఈ మూవీ 9 రోజుల కలెక్షన్లను మీరే చూసేయండి!
ఫన్ స్టోరీతో వచ్చిన సింహా
శ్రీ సింహా కోడూరి హీరోగా రితేష్ రానా రూపొందించిన సినిమానే 'మత్తు వదలరా 2'. ఈ సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు, హేమలత పెద్దమల్లు నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేయగా.. సత్య కీలక పాత్రలో నటించాడు. అలాగే, వెన్నెల కిశోర్, సునీల్ నటించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు.

ఈ మూవీకి బిజినెస్ ఇలా
చాలా రోజుల క్రితమే వచ్చి అలరించిన 'మత్తు వదలరా' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిందే 'మత్తు వదలరా 2'. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 8.00 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.

9వ రోజు ఇలా.. మొత్తంగా
రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన 'మత్తు వదలరా 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన భారీగానే వస్తోంది. ఇలా ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. దీంతో 9వ రోజైన శనివారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 60 లక్షలు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 70 లక్షలు రాబట్టింది. ఇలా మొత్తంగా రూ. 12.80 కోట్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.


Click it and Unblock the Notifications











