శ్రీదేవి ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ కలెక్షన్స్ కేక..
హైదరాబాద్ : హీరోయిన్ శ్రీదేవి 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న దేశ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద వండర్ ఫుల్ కలెక్షన్స్ సాధిస్తోంది. తొలి వారంలో ఈచిత్రం రూ. 20.88 కోట్లు వసూలు చేసింది.
ఈ చిత్రం విడుదలైన తొలి రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలు జనాలు లేక వెల వెల పోయాయి. కేవలం 15% నుంచి 20% ఆక్సుపెన్సీ మాత్రమే వచ్చింది. అయితే క్రిటిక్స్ ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇవ్వడం, సినిమా బాగుందనే మౌత్ టాక్ రావడంతో తొలి రోజు ఈవినింగ్ షోలు ప్రేక్షకులతో కిట కిటలాడాయి.
తొలి రోజు ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రం రూ. 2.51 కోట్లు వసూలు చేసింది. పాసిటివ్ టాక్ తో శని, ఆదివారాల్లో సినిమా బిజినెస్ పెరిగింది. వీకెండ్ ముగిసే సరికి ఏకంగా రూ. 13.28 కోట్లు వసూలు చేసింది. శుక్ర వారం రూ. 2.51 కోట్లు, శనివారం రూ. 4.5 కోట్లు, ఆదివారం రూ. 6.27 కోట్లు వసూలు చేసింది.
ఒక భారతీయ గృహిణి ఇంగ్లీష్ మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతూ ఎదుర్కొన్న అవమానాలు, ఆ తర్వాత ఆమె ఏం చేసింది అనే ఇతి వృత్తంతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీదేవి, ఆదిల్ హుస్సేన్, ప్రియా ఆనంద్, మెహిదీ నెబ్బో నటించిన ఈచిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, సౌండ్: రసూల్ పూకుట్టి, ఫోటో గ్రఫీ: లక్ష్మణ్ ఉటేకర్, ఎడిటింగ్: హేమంతి సర్కార్, నిర్మాతలు: రాకేష్ జుంజుంవాలా, ఆర్.దమని, సునీల్ లుల్లా, ఆర్. బాల్కీ, రచన-దర్శకత్వం: గౌరీ షిండే.


Click it and Unblock the Notifications











