twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sridevi soda center, IVNR 1st day Collections: సుధీర్ బాబు సుశాంత్ పోరాటం.. వర్షాల ఎఫెక్ట్ గట్టిగానే..

    |

    సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద మరోసారి వార్స్ మొదలయ్యాయి. మినీ సినిమాలు అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్ ను అందుకుంటున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ తో పాటు మరోవైపు వర్షాలు కాస్త ప్రభావం చూపుతున్నాయనే చెప్పాలి. దీంతో మరికొన్ని ఏరియాల్లో వసూళ్లు ఒక్కసారిగా తగ్గిపోతున్నాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు, సుశాంత్ అయితే గట్టిగానే పోటీ పడ్డారు. శ్రీదేవి సోడా సెంటర్, ఇచ్చట వాహనములు నిలుపరాదు.. సినిమాల మంచి హైప్ తోనే విడుదల అవ్వగా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు డీసెంట్ ఓపెనింగ్స్ ను అందుకున్నాయి.

     ఊహించని విధంగా ఓపెనింగ్స్

    ఊహించని విధంగా ఓపెనింగ్స్

    ముందుగా సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా విషయానికి వస్తే.. యువ దర్శకుడు దర్శన్ తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ కొట్టడం ఖాయాం అని ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యూనిట్ సభ్యులు నమ్మకంతోనే చెప్పారు. అయితే విడుదల అనంతరం టాక్ ప్రకారం సినిమా ఊహించని విధంగా ఓపెనింగ్స్ ను అందుకుంది.
    ఒక యదార్ధ ఘటనని బేస్ చేసుకుని యాక్షన్, కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన ఈ సినిమా పెద్దగా ఓపెనింగ్స్ అయితే రాబట్టలేదు.

    IVNR మొదటి రోజు కలెక్షన్స్

    IVNR మొదటి రోజు కలెక్షన్స్

    తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటిరోజు 32లక్షల గ్రాస్ అందుకుంది. అందులో 17లక్షల రేంజ్ లో షేర్ దక్కినట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన షేర్ 19లక్షలు అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ గా మంచి బిజినెస్ జరగడంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద ఒత్తిడి ఏమి లేదనే చెప్పాలి. 2.5కోట్ల టార్గెట్ తోనే మార్కెట్ లోకి వచ్చింది. కానీ మొదటిరోజు కనీసం 20 లక్షల షేర్ కూడా రాలేదు. ఇక సినిమా హిట్టవ్వాలి అంటే శని ఆదివారం మరింత పవర్ఫుల్ గా వసూళ్లను అందుకోవాల్సి ఉంటుంది.

     శ్రీదేవి సోడా సెంటర్..

    శ్రీదేవి సోడా సెంటర్..


    ఎస్ ఎమ్ ఎస్ సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన నటుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేకమైన హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుధీర్ నటించిన లేటెస్ట్ సినిమా శ్రీదేవి సోడా సెంటర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలాస 1978 మూవీ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ప్రారంభ దశ నుండి మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సాంగ్స్ మరింతగా హైప్ క్రియేట్ చేశాయి.

    ట్రైలర్ తోనే పాజిటివ్ టాక్

    ట్రైలర్ తోనే పాజిటివ్ టాక్


    సుధీర్ సరసన యువ నటి ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఎంతో భారీగా నిర్మించారు. అటు ఆడియో తో పాటు ఆ తరువాత విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఇక మొత్తంగా ఎన్నో అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుని ప్రస్తుతం ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది.

    మొత్తం ఎన్ని థియేటర్స్ లో అంటే..

    మొత్తం ఎన్ని థియేటర్స్ లో అంటే..


    ఆకట్టుకునే రస్టిక్ లవ్ స్టోరీ మూవీ గా పలు యాక్షన్, ఎమోషనల్ అంశాలతో దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమా తీసారని, హీరో సుధీర్, హీరోయిన్ ఆనంది తమ పాత్రల్లో ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ఇతర క్యారెక్టర్స్ లో నటించిన వారందరూ కూడా యాక్టింగ్ అదరగొట్టారని ఆడియన్స్ అంటున్నారు. అయితే ప్రస్తుతం మంచి టాక్ తో కొనసాగుతున్న ఈ సినిమా ఫస్ట్ డే మంచి కలెక్షన్ ని సొంతం చేసుకుంది.

    కాగా ఈ సినిమా మొత్తం 550 థియేటర్స్ లో విడుదలైంది.

     మొదటిరోజు కలెక్షన్స్

    మొదటిరోజు కలెక్షన్స్


    మొదటిరోజు ఏరియాలా వారిగా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.. నైజాం రూ. 48 లక్షలు, సీడెడ్ రూ. 22 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 17 లక్షలు, ఈస్ట్ రూ. 13 లక్షలు, వెస్ట్ రూ. 7 లక్షలు, గుంటూరు రూ. 14 లక్షలు, కృష్ణా రూ. 8 లక్షలు, నెల్లూరు రూ. 3 లక్షలు, ఇక ఏపీ, తెలంగాణ మొత్తం రూ. 1.32 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 3 లక్షలు, ఓవర్సీస్ : రూ. 6 లక్షలు. మొత్తం వరల్డ్ వైడ్ గా రూ. 1.83 కోట్ల షేర్ ని అలానే 2.40 కోట్ల మార్క్ గ్రాస్ కలెక్షన్ దక్కించుకుంది.

    Recommended Video

    Bombhaat Director About Chandini Chowdary | Bombhaat Team Interview Part 4
    ఇంకా ఎంత రావాలి అంటే..

    ఇంకా ఎంత రావాలి అంటే..

    ఈ విధంగా ఫస్ట్ డే ఏరియా వైస్ కలెక్షన్ సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 8 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. అంటే దాదాపుగా మరొక రూ. 7 కోట్లకు పైగా షేర్ ని కనుక ఈ సినిమా రాబడితేనే ప్రాఫిట్స్ జోన్ లో వచ్చే అవకాశం ఉంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం రెండవ రోజు శ్రీదేవి సోడా సెంటర్ మూవీకి చాలా ఏరియాల్లో బాగానే కలెక్షన్స్ వస్తున్నాయని, అయితే ఓవరాల్ గా ఈ మూవీ ఎంత రాబడుతుందో తెలియాలి అంటే శని, ఆడిగివారం వరకు ఆగాల్సిందే. మరి ఈ సినిమాతో హీరో సుధీర్ ఏ స్థాయిలో మార్కెట్ ను పెంచుకుంటాడో చూడాలి.

    English summary
    Sridevi soda center Ichata Vahanamulu Nilupa Radu 1st day Collections,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X