twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sridevi Soda Center, IVNR day 1 collections: బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లు..

    |

    కరోనావైరస్ లాక్‌డౌన్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో మరోవారం పలు సినిమాలు సందడి చేశాయి. వివాహ భోజనంబు సోని లివ్ యాప్‌లో ఓటీటీ రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తే.. శ్రీదేవి సోడా సెంటర్, ఇచ్చట వాహనములు నిలుపరాదు, హౌస్ అరెస్ట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్ పరంగా ఈ చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను పెంచడంతో బిజినెస్ వ్యవహారాలు క్రేజీగా జరిగాయనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమైంది. ఈ సినిమాల ప్రీరిలీజ్ వ్యవహారాల, తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉన్నాయంటే..

    శ్రీదేవి సోడా సెంటర్ ప్రీ రిలీజ్ బిజినెస్

    శ్రీదేవి సోడా సెంటర్ ప్రీ రిలీజ్ బిజినెస్

    ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో శ్రీదేవి సోడా సెంటర్ ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం సుమారు 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే రిలీజ్‌కు ముందు నాన్ థియేట్రికల్ హక్కులు అంటే డిజిటల్, శాటిలైట్ తదితర బిజినెస్ రూపంలో నిర్మాతలకు 12.5 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక థియేట్రికల్ బిజినెస్ రూపంలో మరో 8 కోట్ల రూపాయలు సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

    ఇచ్చట వాహనములు ప్రీ రిలీజ్ బిజినెస్

    ఇచ్చట వాహనములు ప్రీ రిలీజ్ బిజినెస్

    ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రం సుమారు రూ.6.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ధాటిగానే జరిగింది. ఓటీటీ హక్కులను సుమారు 3 కోట్ల రూపాయలకు ఆహా సొంతం చేసుకొన్నది. ఇక సోని సంస్థ హిందీ రైట్స్‌ను రూ.2.75 కోట్లు దక్కించుకొన్నది. శాటిలైట్ రూపంలో మరో రూ.2 కోట్లు ఖాతాలో చేరాయి. ఇక మ్యూజిక్ రైట్స్‌ను ఆదిత్య మ్యూజిక్ రూ.15 లక్షలకు సొంతం చేసుకొన్నది. మొత్తంగా ఈ చిత్రం సుమారు కోటికిపైగా నిర్మాతలకు లాభాన్ని అందించింది. అయితే థియేట్రికల్ బిజినెస్ సుమారు 3 కోట్ల మేర జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    శ్రీదేవీ సోడా సెంటర్ థియేటర్లలో

    శ్రీదేవీ సోడా సెంటర్ థియేటర్లలో

    ఇక శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం భారీగా థియేటర్లలో రిలీజ్ అయింది. నైజాంలో 200 థియేటర్లకుపైగా, ఆంధ్రాలో 300 థియేటర్లకుపైగా అత్యధిక థియేటర్లలో రిలీజైంది. ఇటీవల కాలంలో అత్యధికంగా కూడా బిజినెస్‌ను నమోదు చేసుకొన్నది.

    ఇచ్చట వాహనాలు రిలీజ్ కౌంట్ ఎంతంటే..

    ఇచ్చట వాహనాలు రిలీజ్ కౌంట్ ఎంతంటే..

    అలాగే ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రం కూడా భారీగానే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండు రాష్ట్రాల్లో 250కి పైగా థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ చిత్రానికి అంతగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు కాకపోవడం షాకింగ్ కలిగించే అంశంగా మారింది.

    తొలి రోజు శ్రీదేవి సోడా సెంటర్ అంచనాల

    తొలి రోజు శ్రీదేవి సోడా సెంటర్ అంచనాల

    ఆగస్టు 27 తేదీ సాయంత్రం వరకు ట్రేడ్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. శ్రీదేవి సోడా సెంటర్ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ కావడం వల్ల సుధీర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    Recommended Video

    Ichata Vahanamulu Nilupa Radu Teaser
    సుశాంత్ మూవీ కలెక్షన్స్ రిపోర్ట్

    సుశాంత్ మూవీ కలెక్షన్స్ రిపోర్ట్


    ఇక ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.30 లక్షల రాబట్టే అవకాశం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే సాయంత్రం ఆటల రిపోర్డ్ అంతగా పాజిటివ్ లేదనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఈ రెండు చిత్రాలు ఏ రేంజ్ వసూళ్లను అందుకొంటాయే వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా, హౌజ్ అరెస్ట్ రిపోర్టు అందుబాటులో లేవు. వివాహ భోజనంబు ఓటీటీ రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ నుంచి ఈ సినిమా తప్పుకొన్నది.

    English summary
    Sridevi Soda Center, Ichata Vahanamulu Nilupa movies hits the screeen on August 27th. As per Trade talk, Here are the collections report for day 1 worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X