twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నమ్మలేనంత : ‘శ్రీమంతుడు' 5 రోజుల కలెక్షన్స్ (ఏరియావైజ్)

    By Srikanya
    |

    హైదరాబాద్: మహేష్ బాబు ‘శ్రీమంతుడు' ఫస్ట్ వీకెండ్ అదరిపోయే బిజినెస్ చేయడంతో పాటు, సోమవారం కూడా మంచి వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. 4 రోజులు ముగిసిన తర్వాత ఏపీ-తెలంగాణలో రూ. 30.95 కోట్ల షేర్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది' చిత్రం రికార్డును ‘శ్రీమంతుడు' కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ చేసింది. ఈ చిత్రం ఐదు రోజుల కలెక్షన్స్ ఈ క్రింద విధంగా ఉన్నాయి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    తమ ‘శ్రీమంతుడు' చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై నవీన్ ఎర్నేని రూపొందించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతూ తొలిరోజే 30 కోట్ల రూపాయల షేర్‌ను సాధించిందని నిర్మాత తెలిపారు.

    దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, అన్ని చోట్లా సినిమా పెద్ద హిట్ అయిందని, మొదటిరోజునుండి అన్ని వర్గాల ప్రేక్షకుల వౌత్‌టాక్‌తోనే అనుకున్నదానికన్నా హిట్ అయిందని తెలిపారు. ఇటువంటి చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్న కధానాయకుడి కష్టమంతా ఈ చిత్రంలో కన్పిస్తుందని, చిత్ర విజయం గూర్చి విన్న తరువాత తాము పడ్డ కష్టం మర్చిపోయామని ఆయన అన్నారు.

    ప్రేక్షకులనుండి తమ సంస్థ నిర్మించిన తొలి చిత్రానికి మంచి టాక్ రావడం ఆనందంగా ఉందని, అన్ని కేంద్రాల్లో మంచి రిపోర్టులు వస్తున్నాయని, భారతదేశంలోనే కాక యుఎస్‌ఎ, ఓవర్‌సీస్‌లో విజయఢంకా మ్రోగిస్తోందని ఆయన తెలిపారు.


    చిత్రం 5 రోజుల కలెక్షన్స్ ఈ క్రింద విధంగా ఉన్నాయి...స్లైడ్ షోలో...

    నైజాం

    నైజాం

    తొలి రోజు: 5.09 కోట్లు(నాన్ బాహుబలి రికార్డ్)
    2వరోజు: రూ. 2.21 కోట్లు
    3వరోజు: రూ. 2.21 కోట్లు
    4వరోజు: 1.94 కోట్లు
    5 వ రోజు - 1.33 కోట్లు
    టోటల్: రూ.12.78 కోట్లు

     సీడెడ్

    సీడెడ్



    రోజు 1 - 2.11 కోట్లు
    రోజు 2 - 1.17 కోట్లు
    రోజు 3 - 1.17 కోట్లు
    రోజు 4 - 65 లక్షలు
    రోజు 5 - 55 లక్షలు

    మొత్తం - 5.65 కోట్లు

    వైజాగ్

    వైజాగ్



    రోజు 1 - 105 లక్షలు
    రోజు 2 - 56 లక్షలు
    రోజు 3 - 56 లక్షలు
    రోజు 4 - 44లక్షలు
    రోజు 5 - 36లక్షలు

    మొత్తం - 2.97 కోట్లు

    తూర్పు గోదావరి

    తూర్పు గోదావరి


    రోజు 1 - 151 లక్షలు
    రోజు 2 - 54 లక్షలు
    రోజు 3 - 56లక్షలు
    రోజు 4 - <35లక్షలు
    రోజు 5 - 36లక్షలు

    మొత్తం - 3.32 కోట్లు

    పశ్చిమ గోదావరి

    పశ్చిమ గోదావరి



    రోజు 1 - 170 లక్షలు+
    రోజు 2 - 32 లక్షలు+
    రోజు 3 - 36.5 లక్షలు
    రోజు 4 - 21లక్షలు
    రోజు 5 - 22లక్షలు
    మొత్తం - 2.82 కోట్లు

    కృష్ణా

    కృష్ణా


    రోజు 1 - 100 లక్షలు+
    రోజు 2 - 42 లక్షలు
    రోజు 3 - 49లక్షలు
    రోజు 4 - <30లక్షలు
    రోజు 5 - 33లక్షలు

    మొత్తం - 2.54 కోట్లు

    గుంటూరు

    గుంటూరు



    రోజు 1 - 168 లక్షలు
    రోజు 2 - 47 లక్షలు
    రోజు 3 - 54లక్షలు
    రోజు 4 - <32లక్షలు
    రోజు 5 - 30లక్షలు

    మొత్తం - 3.31 కోట్లు

    నెల్లూరు

    నెల్లూరు



    రోజు 1 - 51 లక్షలు
    రోజు 2 - 18 లక్షలు
    రోజు 3 - 20లక్షలు
    రోజు 4 - 12లక్షలు
    రోజు 5 - 14లక్షలు

    మొత్తం - 1.15 కోట్లు

    మొత్తం

    మొత్తం

    5 రోజు ల్లో ఆంధ్రప్రేశ్ / తెలంగాణా షేర్ 34.54 కోట్లు

    ప్రపంచవ్యాప్తంగా 52 కోట్లు (ఇది కేవలం ట్రేడ్ లో చెప్పబడుతున్న లెక్కలే

    తెరముందు

    తెరముందు


    జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం.

    తెర వెనుక

    తెర వెనుక

    ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు,

    టెక్నికల్...

    టెక్నికల్...

    ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    Mahesh Babu'ss Srimanthudu collected nearly Rs. 3.54 cr on day 5 from AP/Nizam. The film's world wide collection is said to be nearly 52 cr. The film meed to rncollect six more కోట్లుores to reach the break even and it is expected to rntouch the mark by end of this week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X