మహేష్ బాబు మూవీ రికార్డ్ బద్దలు కొట్టిన ‘ఎఫ్ 2’
వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రప్టేషన్' విడుదలైన అన్ని ఏరియాల్లో కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళుతోంది. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు సైతం 'ఎఫ్2' కామెడీ సునామీలో కొట్టకుపోతున్నాయి.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... 'ఎఫ్ 2' చిత్రం మహేష్ బాబు 'శ్రీమంతుడు' రికార్డును నైజాంలో బద్దలు కొట్టింది. కొరటాల శివ దర్శకత్వంలో 2015లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో నైజాంలో లైఫ్ టైమ్ రూ. 22.34 కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఎఫ్2 నెల రోజుల్లో రూ. 22.47 కోట్లు వసూలు చేయడం ద్వారా బీట్ చేసింది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'ఎఫ్ 2' ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కాస్త అటూ ఇటుగా దాదాపు రూ. 80 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లకు ఈ చిత్రం రెట్టింపుకంటే ఎక్కువ లాభం తెచ్చిపెట్టింది.
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీకి త్వరలో సీక్వెల్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'ఎఫ్ 3' పేరుతో రాబోయే ఈ మూవీలో మరో హీరో కూడా యాడ్ అవుతారని, ఆ హీరో రవితేజ కావొచ్చనే ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











