షాకింగ్ రికార్డ్ :శాటిలైట్ రైట్స్ రూ.48 కోట్లు
ముంబై : ఇప్పుడు సినిమా స్టామినాని శాటిలైట్ బిజినెస్ పరంగా కూడా అంచనా వేస్తున్నారు. ఓ చిత్రానికి ఎంత శాటిలైట్ వచ్చిందనే దాన్ని బట్టి కూడా సినిమా బిజినెస్ అవుతోంది. ఈ క్రమంలో విడుదలకు ముందుగానే 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సంచలనాలు సృష్టిస్తోంది. దాని శాటిలైట్ హక్కులు ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడుపోయాయి.
కొత్తగా వచ్చిన 'ఎండ్ ఫిలిమ్స్' అనే చానల్ ఈ హక్కుల్ని సొంతం చేసుకుంది. అంతేకాదు 'చెన్నై ఎక్స్‌ప్రెస్' కనుక బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్కు దాటితే శ్లాబ్ ప్రకారం మరింత ఎక్కువ చెల్లించే అవకాశం ఉంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్ సరసన హీరోయిన్ గా దీపికా పడుకోనే నటించింది. రంజాన్ పండుగకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఓ వైపు ఆయన తాజా చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్' ప్రమోషన్లు ఫుల్ స్వింగ్‌తో నడుస్తుండగా, ఇంకోవైపు ఆయన ఒక కార్యక్రమం తర్వాత ఇంకో కార్యక్రమానికి హాజరవుతున్నాడు. దాంతో ఈ చిత్రానికి మార్కెట్లో విపరీతమైన క్రేజ్ క్రియేట్ అయ్యింది.
ఆగస్టు 8న విడుదలకు సిద్ధమైన ఈచిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల చేసారు. ముంబై నుంచి రామేశ్వరం వరకు ప్రయాణం చేసిన చిత్ర కథానాయకుడికి ఎదురైన అనుభవాలతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. కాగా...తాజాగా విడుదలైన ఈచిత్రం ట్రైలర్ చూస్తుంటే పలు దక్షిణాది చిత్రాలతో పాటు, తెలుగు సినిమాలైన ఒక్కడు, నరసింహ నాయుడు, అంత:పురం, మర్యాద రామన్న లాంటి చిత్రాల్లోని సీన్లను దర్శకుడు రోహిత్ కాపీ కొట్టాడని స్పష్టం అవుతోంది.
ఆ సీన్లన్నీ దక్షిణాది సినిమాల్లో బాగా పాపులర్ అయినవే. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ సినిమాల పరిచయం లేదు. దీంతో వాటిని తన క్రియేటివిటీగా అక్కడి ప్రేక్షకులకు చూపించబోతున్నాడు దర్శకుడు. రోహిత్ శెట్టికి బాలీవుడ్లో మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇప్పటి వరకు ఆయన 8 సినిమాలు తీస్తే అందులో 7 సూపర్ హిట్ కాగా ఒకటి మాత్రం యావరేజ్.
రోహిత్ శెట్టి గత చిత్రాలు చూసిన షారూఖ్ ఇంప్రెస్ అయి తన డేట్స్ ఇవ్వటానికి ముందుకు రావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కింది. దర్శకుడు రోహిత్ శెట్టి మాట్లాడుతూ..నిజానికి షారూఖ్ ని ఇంప్రెస్ చేయటం అంత ఈజీ కాదు. ఆయనతో మంచి యాక్షన్ కామెడీ చేయాలనేది నా కోరిక. ఈ సినిమా షారూఖ్ అభిమానులను అలరించే సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను అంటున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై షారుక్ భార్య గౌరీఖాన్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











