twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR 25 days Collections.. కేజీఎఫ్2 ధాటిని ఎదురించి.. ఇప్పటి వరకు ఎంత లాభమంటే?

    |

    ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రేక్షకుల ఆదరణ పొందిన RRR చిత్రం నాలుగో వారంలో కూడా సత్తా చాటుతున్నది. పలు ప్రాంతాల్లో 25 రోజున మంచి వసూళ్లను నమోదు చేసింది. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం బాక్సాఫీస్ పరుగును మెల్లమెల్లగా కొనసాగిస్తున్నది. అయితే 25వ రోజున RRR సాధించిన వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. తాజా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

    తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఇప్పటికే 109 కోట్లు వసూలు చేసింది. ఆంధ్రాలో అన్నిప్రాంతాలను కలిపితే.. 155 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక 25వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 36 లక్షల షేర్‌ను సొంతం చేసుకొన్నది. దీంతో ఈ సినిమా 398.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

     హిందీలో 4వ వారం వసూళ్లు

    హిందీలో 4వ వారం వసూళ్లు

    RRR మూవీ హిందీలో కూడా భారీగానే వసూళ్లను రాబట్టింది. కేజీఎఫ్2 ప్రభంజనాన్ని ఎదుర్కొని గత మూడు రోజుల్లో మెరుగైన కలెక్షన్లను నమోదు చేసింది. శుక్రవారం 3 కోట్లు, శనివారం 3.30 కోట్లు, ఆదివారం 3.75 కోట్లు సాధించింది. ఇక సోమవారం ఈ చిత్రం సుమారు 2 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం హిందీలో 254 కోట్లు సాధించి సూపర్‌హిట్‌గా నిలిచింది.

    తెలుగేతర రాష్ట్రాల్లో కలెక్షన్లు

    తెలుగేతర రాష్ట్రాల్లో కలెక్షన్లు

    ఇక RRR చిత్రం తెలుగేతర రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది. గత 25 రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. కర్ణాటకలో 42.80 కోట్లు, తమిళనాడులో 37.55 కోట్లు, కేరళలో 10.36 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 9.03 కోట్లు నమోదు చేసింది. ఒక ఓవర్సీస్‌లో 98.35 కోట్ల వసూళ్లను రాబట్టింది.

    ప్రపంచవ్యాప్తంగా రాబడి

    ప్రపంచవ్యాప్తంగా రాబడి

    ఇక ప్రపంచవ్యాప్తంగా RRR చిత్రం అంచనాలకు మించి కలెక్షన్లను రాబట్టింది. గత 25 రోజుల్లో 1087 కోట్ల గ్రాస్, 588 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. రాజమౌళి కెరీర్‌లో 1000 కోట్లు సాధించడం ఇది రెండోసారి. గతంలో బాహుబలితో ఈ ఘనతను సాధించిన విషయం తెలిసిందే.

    25 రోజుల్లో లాభం ఎంతంటే?

    25 రోజుల్లో లాభం ఎంతంటే?

    RRR చిత్రం ట్రేడ్ వర్గాలను అంచనాలు పక్కనపెట్టి ఊహించని విధంగా ప్రీ రిలీజ్‌ను సొంతం చేసుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 451 కోట్ల మేర బిజినెస్ చేసింది. 453 కోట్ల బ్రేక్ ఈవెన్ బాక్సాఫీస్ పరుగు ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పటి వరకు 588 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అంటే ఈ చిత్రం 135 కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

    English summary
    RRR 25 days worldwide Collections are slow downed after KGF2 movie release. It has collected 1087 crores grosss, 588 crores share.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X