RRR Closing Collections.. ముగిసిన బాక్సాఫీస్ జైత్రయాత్ర.. RRR లాభం ఎంతో తెలుసా?
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన మల్టీ స్టారర్ చిత్రం RRR ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. గత ఆరు వారాలకుపైగా అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. 50 రోజుల పండుగను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను దాదాపు పూర్తి చేసుకొన్నది. ఈ క్రమంలో RRR మూవీ క్లోజింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్
RRR సినిమా విషయానికి వస్తే.. టీజర్లు, ట్రైలర్లు క్రేజ్ పెంచడంతో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. నైజాంలో థియేట్రికల్ హక్కులు 70 కోట్లకు, సీడెడ్ హక్కులు 37 కోట్లు, ఉత్తరాంధ్రలో 22 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా హక్కులు 14 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కోట్లు, కృష్ణా జిల్లాలో 13 కోట్లు, నెల్లూరు జిల్లాలో 8 కోట్ల మేర థియేట్రికల్ హక్కుల బిజినెస్ జరిగింది. దాంతో 191 కోట్ల బిజినెస్ నమోదైంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక RRR మూవీ తెలుగేతర రాష్ట్రాల ప్రీరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటక స్టేట్ థియేట్రికల్ హక్కులు 41 కోట్లు, తమిళనాడు స్టేట్ థియేట్రికల్ హక్కులు 35 కోట్లు, హిందీ హక్కులు 92 కోట్లు, రెస్టాఫ్ ఇండియా హక్కులు 8 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 75 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా 451 కోట్ల బిజినెస్ జరిగింది.

453 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో
RRR చిత్రం 453 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. నైజాంలో 112 కోట్లు, సీడెడ్‌లో 51 కోట్లు, ఉత్తరాంధ్రలో 35 కోట్లు వసూలు చేసింది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 17 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కోట్లు, గుంటూరు జిల్లాలో 18.5 కోట్లు, కృష్ణా జిల్లాలో 15 కోట్లు, నెల్లూరు జిల్లాలో 10 కోట్లు వసూలు చేసింది.

కర్ణాటక, ఓవర్సీస్‌లో కలిపి
ఇక తెలుగేతర రాష్ట్రాల్లో విషయానికి వస్తే.. కర్ణాటకలో 45 కోట్లు రాబట్టింది. కేరళలో 11 కోట్లు, హిందీలో 133 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 9.15 కోట్లు, ఓవర్సీస్‌లో 102 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమాలో 1124 కోట్లు గ్రాస్, 605 కోట్ల షేర్ నమోదు చేసింది.

RRR మూవీ లాభం ఎంతంటే?
RRR చిత్రం ఇటీవల కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. 453 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో జర్నీ ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పటి రకు 152 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా రికార్డును క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











