Don't Miss!
- News
Solar Rooftop In Schools: మార్చిలోగా 500 ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ రూఫ్టాఫ్ ఏర్పాటు..
- Sports
SAT20 : విల్ జాక్స్ ఊచకోత.. చిత్తుగా ఓడిన ఎంఐ!
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
RRR day1 worldwide collections ది బ్యాట్‌మెన్ రికార్డు బ్రేక్.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ..
ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. విడుదలైన ప్రతీ చోట బాక్సాఫీస్‌ను సునామీలా కుదిపేస్తున్నది. కలెక్షన్ల భూకంపం వచ్చిందా అనే విధంగా ఈ చిత్రం కలెక్షన్లను నమోదు చేస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోను.. అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేస్తున్నది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల వసూలు చేసిందంటే..
Recommended Video


తొలి రోజే 100 కోట్ల షేర్
RRR సినిమా భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఇప్పటి వరకు ఏ చిత్రం సాధించనంతగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది. ఇప్పటి వరకు తొలి రోజు 100 కోట్ల నికర వసూళ్లను సాధించిన చిత్రాల్లో బాహుబలి 2, సాహో ఉన్నాయి. బాహుబలి చిత్రం 2017లో తొలి రోజు 100 కోట్లు వసూలు చేస్తే.. ఆ తర్వాత 2019లో సాహో చిత్రం 100 కోట్లు సాధించిన చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా ఆ రెండు చిత్రాల కలెక్షన్లను తడిచిపెట్టి RRR చిత్రం సుమారు 120 కోట్ల షేర్ సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు
RRR మూవీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తాజా సమాచారం ప్రకారం రూ.70 కోట్లకుపైగానే షేర్, 130 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నైజాంలోనే ఏకంగా 40 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ చిత్రం నైజాంలోనే వంద కోట్లు వసూలు చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రాలో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో
RRR చిత్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో హాలీవుడ్ చిత్రాల రికార్డులను తుడిచిపెట్టింది. ఆస్ట్రేలియాలో ది బ్యాట్‌మెన్ చిత్రం వసూళ్లను అధిగమించింది. న్యూజిలాండ్‌లో నంబర్‌వన్ స్థానంలో RRR నిలిచింది. ఆస్ట్రేలియాలో 702,560 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే 4.03 కోట్లు, న్యూజిలాండ్‌లో 69,741 న్యూజిలాండ్ డాలర్లు, అంటే 37.07 లక్షలు వసూలు చేసింది.

అమెరికా, కెనడా, యూకేలో
ఇక అమెరికాలో కూడా RRR సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అమెరికాలో ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లతో కలిపి 5 మిలియన్ డాలర్లకుపైగా అంటే సుమారు 35 కోట్లు వసూలు చేసింది. కెనడాలో 270,361 డాలర్లు, యూకేలో 238,313 పౌండ్లు, అంటే భారతీయ కరెన్సీలో 2.40 కోట్ల రూపాయలు రాబట్టింది.

తొలి రోజున ఎన్ని వందల కోట్లంటే?
ఇక తెలుగేతర రాష్ట్రాల్లో RRR మూవీ భారీ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 128 కోట్ల వసూళ్లు, కర్ణాటకలో తొలి రోజు 22 కోట్లు, తమిళనాడు, కేరళలో 18 కోట్లు, ఉత్తరాది రాష్ట్రాల్లో 34 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 66 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. దీంతో తొలి రోజున 260 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను బాక్సాఫీస్ నమోదు చేసింది.