RRR Japan Collections: టాప్ 3 మూవీగా రికార్డు కలెక్షన్స్.. బాహుబలిని బ్రేక్ చేసేలా..

టాలీవుడ్ స్థాయిని మరొక రేంజ్ కు తీసుకుని వెళ్లే విధంగా దర్శకధీరుడు రాజమౌళి తెరపైకి తీసుకువచ్చిన RRR సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా విదేశీ సినీ ప్రముఖులను కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైనప్పుడు ఈ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలుగజేసింది.

అయితే జపాన్లో కూడా ఈ సినిమా ఇటీవల గ్రాండ్ గా విడుదల చేశారు. కేవలం విడుదల చేయడమే కాకుండా చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడం హైలెట్ గా నిలిచింది. దర్శకుడు రాజమౌళి తో పాటు రామ్ చరణ్ తేజ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఆ ప్రమోషన్స్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా జపాన్ లో కూడా మంచి రికార్డులను అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

Ss rajamouli RRR movie japan latest collections and record

అంతేకాకుండా ఇప్పటివరకు జపాన్ లో విడుదలైన ఇండియన్ సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మూడవ సినిమాగా RRR ఒక రికార్డును క్రియేట్ చేసింది. ఇక టాప్ 2 లో నిలిచేందుకు ఈ సినిమా బాహుబలి 2 రికార్డును కూడా త్వరలోనే బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. జపాన్ లో RRR చిత్రం ఇప్పటి వరకు ¥185 మిలియన్ వసూళ్ళను అందుకుంది.

అయితే ఇప్పటివరకు జపాన్ లో అత్యదిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాల్లో రజనీకాంత్ ముత్తు సినిమా ¥400M వసూళ్ళతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆ తరువాత బాహుబలి జపాన్ లో ¥300M కలెక్షన్స్ తో టాప్ 2 ఇండియన్ మూవీగా కొనసాగుతోంది. ఇక మూడవ స్థానంలో మొన్నటివరకు బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఉండగా ఇప్పుడు RRR సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసి మూడవ స్థానంలోకి వచ్చేసింది. ఇక కలెక్షన్స్ అయితే రోజురోజుకు అక్కడ పెరుగుతూనే ఉన్నాయి. ఇలానే కొనసాగుతే RRR త్వరలోనే బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X