RRR మరో అరుదైన బాక్సాఫీస్ రికార్డు.. మళ్లీ సత్తా చాటిన ఎస్ఎస్ రాజమౌళి
మెగా పవర్‌స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన RRR చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ రికార్డులతో దూసుకెళ్తున్నది. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫ్ వద్ద సంచలన గణాంకాలను నమోదు చేసింది. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన కలెక్షన్ల రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ అరుదైన రికార్డుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అల్లూరి, కొమురం భీమ్ కథతో
స్వాతంత్ర్య సమరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గిరిజన నాయకుడు కోమురం భీమ్ జీవిత కథను ఆధారంగా చేసుకొని ఊహజనిత చిత్రంగా RRR రూపొందింది. ఈ చిత్రంలో ఆలియాభట్, అజయ్ దేవగన్, శ్రీయాసరన్ తదితరులు నటించారు. ఈ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో భారీ కలెక్షన్లు నమోదయ్యాయి.

ఏడో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా
RRR చిత్రం ఉత్తరాదిలో తన సత్తాను చాటుతున్నది. ఈ చిత్రం నాలుగో వారంలో 14.50 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. నాలుగో వారంలో కూడా ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన ఏడో చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. కరోనా లాక్‌డౌన్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది.

1100 కోట్ల క్లబ్‌లో RRR
RRR చిత్రం గత 5 వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్నది. ట్రేడ్ వర్గాల ఊహలకు అందని విధంగా.. అంచనాల భిన్నంగా కాసుల వర్షం కురిపించింది. దాంతో ఈ చిత్రం 28వ రోజున ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. ఇది అసామాన్యమైన విజయం అంటూ చిత్ర యూనిట్ ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేసింది.

29 రోజున అరుదైన ఫీట్
గత 28 రోజుల్లో RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. 28 రోజుల్లో ఈ చిత్రం 1097 కోట్ల గ్రాస్, 592 కోట్ల షేర్‌ను సొంతం చేసుకొన్నది. ఇక 29వ రోజు ప్రపంచవ్యాప్తంగా మరో 50 లక్షలు రాబట్టడంతో 1100 కోట్ల మైలురాయిని అధిగమించింది.

ఫ్యాన్స్‌లో పండుగ వాతావరణం
RRR అరుదైన క్లబ్‌లో చేరడంపై యూనిట్, రాంచరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రం మరిన్ని కలెక్షన్లు వసూలు చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











