రాంచరణ్ మగధీర దుమ్ముదుమారం.. జపాన్ ఆడియన్స్ ఫిదా!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన మగధీర చిత్రం ఒక దృశ్య కావ్యం. టాలీవుడ్ అపురూప చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రంతో వసూళ్ల ప్రభంజనం అంటే ఏంటో చూపించాడు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో మగధీర చిత్రం తిరుగులేని విజయం సాధించింది. తాజగా ఈ చిత్రం జపాన్ లో కూడా సంచలనంగా మారింది.

జపాన్‌లో విడుదల
ఇటీవల మగధీర చిత్రాన్ని జపనీస్ లోకి డబ్ చేసి విడుదల చేశారు. మగధీర చిత్రానికి జపాన్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే 1.2 మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

బాహుబలి మానియా
ఈ ఏడాది ఆరంభంలో బాహుబలి 2 చిత్రాన్ని జపాన్ లో విడుదల చేశారు. జపాన్ లో మంచి విజయం సాధించిన భారతీయ చిత్రాల సరసన బాహుబలి నిలిచింది. బాహుబలి చిత్రంతో జపాన్ లో రాజమౌళికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ మాటకు వస్తే రాజమౌళి ఖ్యాతి బాహుబలి చిత్రంతో విశ్వ వ్యాప్తం అయింది.

రాజమౌళి క్రేజ్
రాజమౌళికి జపాన్ లో ఏర్పడ్డ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు మగధీర చిత్రాన్ని ఇటీవల అక్కడ విడుదల చేశారు. ఈ ప్రయత్నం ఫలించింది. మగధీర చిత్రంలోని ఎమోషన్, రాంచరణ్ సాహసాలకు ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు.

ముత్తు ఇప్పటికీ
జపాన్ లో సూపర్ స్టార్ రజనికి చిత్రం ముత్తు ఇప్పటికి తిరుగులేని చిత్రంగా ఉంది. ముత్తు జపాన్ లో 1.6 మిలియన్ వసూళ్లు సాధించింది. ఆ తరువాత బాహుబలి 2, అమిర్ ఖాన్ 3 ఇడియట్స్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఆ జాబితాలోకి మగధీర చిత్రం కూడా చేరబోతోంది.


Click it and Unblock the Notifications











