twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR 36 days collections.. కొనసాగుతున్న జక్కన్న బాక్సాఫీస్ యాత్ర.. ఎన్ని కోట్ల లాభమంటే?

    |

    RRR మూవీ చిత్రం ఘనంగా 6వ వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ చిత్రం ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఆరో వారంలో కూడా ఈ చిత్రం ఓ మోస్తారు వసూళ్లను సాధిస్తున్నది. కేజీఎఫ్2, బీస్ట్, ఆచార్య లాంటి సినిమాల నుంచి వచ్చిన పోటీని ఎదుర్కొని నిలకడగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం 36వ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏ మేరకు వసూళ్లను సాధించిందంటే..

    ఏపీ, నైజాంలో 36వ రోజున RRR చిత్రం 16 లక్షలు రూపాయలను రాబట్టింది. నైజాంలో 110 కోట్ల షేర్, ఆంధ్రాలో 157 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 404 కోట్ల గ్రాస్, 267 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.

     SS Rajamoulis RRR 36 days collections worldwide

    ఇక RRR చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలేతర ప్రాంతాల్లో కూడా భారీగా వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో ఈ చిత్రం 43.78 కోట్లు, తమిళనాడులో 38.18 కోట్లు, కేరళలో 10.52 కోట్లు, హిందీలో 131.65 కోట్లు, అలాగే ఇతర రాష్ట్రాల్లో 9.15 కోట్లు వసూలు చేసింది.

    ఇక ఓవర్సీస్‌లో RRR మూవీ ప్రభంజనం కొనసాగింది. ఈ సినిమా యూఎస్, యూకే, ఆస్ట్రేలియాతోపాటు ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా 101 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1118 కోట్ల గ్రాస్ వసూళ్లను, 602 కోట్ల షేర్ వసూలు చేసింది.

    RRR సినిమా ఎంత లాభం సాధించిందనే విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 453 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పటికే 148.90 కోట్ల లాభాన్ని సాధించింది. ఇటీవల కాలంలో RRR చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందించుకొన్నది.

    English summary
    RRR 36 days worldwide Collections are slow downed after KGF2 movie release. It has collected 1118 crores worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X