RRR day 1 collections బాహుబలి 2 మించిన వసూళ్లు.. తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?
బాహుబలి తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR మూవీ రికార్డుల వసూళ్లతో బాక్సాఫీస్ యాత్ర మొదలైంది. RRR సినిమా రిలీజ్ తర్వాత సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన మూటగట్టుకొన్నప్పటికీ.. సాధారణ ప్రజల్లో సంతృప్తికరమైన టాక్ వినిపిస్తున్నది. అయితే సినిమా రిలీజ్‌కు ముందే భారీగా అడ్వాన్స్ బుకింగ్ కావడంతో కరెంట్ బుకింగ్ ద్వారా ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందనే విషయం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే RRR సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే?
Recommended Video


నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్రలో
RRR మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా నమోదైంది. నైజాం ఏరియాకు సంబంధించిన థియేట్రికల్ హక్కులు రూ.70 కోట్లు, సీడెడ్ హక్కులు 37 కోట్లకు, ఉత్తరాంధ్ర సంబంధించిన థియేట్రికల్ హక్కులు 22 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ మూడు ప్రాంతాల హక్కుల విలువ సుమారు 130 కోట్లుగా నమోదైంది.

ఆంధ్రాలోని పలు జిల్లాల్లో
ఇక ఆంధ్రాలోని పలు జిల్లాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తూర్పు గోదావరి జిల్లా థియేట్రికల్ హక్కులు 14 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా హక్కులు 12 కోట్లు, గుంటూరు జిల్లా థియేట్రికల్ హక్కులు 15 కోట్లు, కృష్ణా జిల్లా హక్కులు 13 కోట్లు, నెల్లూరు జిల్లా హక్కులు 8 కోట్లకు అమ్ముడుపోయాయనేది ట్రేడ్ వర్గాల రిపోర్ట్. మొత్తంగా ఆంధ్రాలో పలు జిల్లాలో హక్కులు 62 కోట్లుగా నమోదౌంది. దీంతో తెలుగు రాష్ట్రాల హక్కుల విలువ సుమారు 190 కోట్లకుపైగానే ఉంది.

తెలుగేతర రాష్ట్రాల్లో కలెక్షన్లు
ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ ఉత్తరాది రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ హక్కులు 41 కోట్లు, తమిళనాడు హక్కులు 35 కోట్లు, కేరళ హక్కులు 9 కోట్లు, హిందీ హక్కులు 92 కోట్లు, మిగితా రాష్ట్రాల హక్కులు 8 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు 75 కోట్లకు అమ్ముడుపోయాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం 453 కోట్లుగా ట్రేడ్ వర్గాలు నిర్ణయించాయి.

రికార్డుస్థాయి థియేటర్లలో
RRR సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు తగినట్టుగానే రికార్డుస్థాయి థియేటర్లలో రిలీజైంది. నైజాంలో 440పైగా థియేటర్లు, సీడెడ్‌లో 385, ఆంధ్రాలో 560 థియేటర్లలో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 1400 థియేటర్లలో రిలీజైంది. ఇక కర్ణాటకలో 310 థియేటర్లు, తమిళనాడులో 480, కేరళ 300, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 3900 థియేటర్లలో రిలీజైంది. దాంతో ఇండియాలో ఈ చిత్రం 6400 థియేటర్లలో రిలీజైంది. అలాగే ఓవర్సీస్‌లో 3800 థియేటర్లలో కలిపి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 10200 థియేటర్లలో రిలీజైంది.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఇలా..
ఇక RRR తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. నైజాంలో 22 కోట్ల షేర్ నమోదు చేసే అవకాశం ఉంది. సీడెడ్ ఏరియాలో 14 కోట్ల షేర్, ఆంధ్రాలో 36 కోట్ల మేర షేర్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లోనే 70 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది.

కర్ణాటక, తమిళనాడు, కేరళలో
తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే. కర్ణాటకలో 8 కోట్ల షేర్, తమిళనాడులో 5 కోట్ల షేర్, కేరళలో 1.2 కోట్ల షేర్ సాధించే అవకాశం కనిపిస్తున్నది. ఓవర్సీస్‌లో 26 కోట్ల షేర్ నమోదు అయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల షేర్.. రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

RRR ఎంత వసూలు చేస్తే బ్లాక్ బస్టర్
ఇదిలా ఉండగా, ఈ సినిమా 800 కోట్ల షేర్ సాధిస్తే.. బ్లాక్ బస్టర్‌గా, సూపర్ హిట్ సాధిస్తే.. 630 కోట్లు, 450 కోట్లకుపైగా వసూలు చేస్తే హిట్.. 450 కోట్లకు తక్కువగా వస్తే.. యావరేజ్ కలెక్షన్లు, 420 కోట్ల లోపు వసూలు చేస్తే ఫ్లాప్‌గా, 350 నుంచి 370 లోపు వస్తే డిజాస్టర్ అని ట్రేడ్ వర్గాలు డిసైడ్ చేశాయి.


Click it and Unblock the Notifications











