RRR day 4 collections 1000 కోట్లపై గురిపెట్టిన రాంచరణ్, ఎన్టీఆర్.. కొత్త రికార్డులతో బాక్సాఫీస్ బద్దలు!

RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తున్నది. విడుదలైన ప్రతీ చోట వసూళ్ల సునామీని కురిపిస్తూ సరికొత్త రికార్డులకు ఈ చిత్రం వేదికగా నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే నాలుగో రోజున RRR చిత్రం బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగించింది. ఈ సినిమా నాలుగో రోజున ఏ మేరకు కలెక్షన్లు రాబట్టవచ్చనే ట్రేడ్ వర్గాల అంచనా వివరాల్లోకి వెళితే..

Recommended Video

RRR Movie నాలుగో రోజూ రికార్డ్ కలెక్షన్స్.. సోమవారం సెంటిమెంట్ బ్రేక్ | Filmibeat Telugu
నాలుగో రోజున క్షీణించినా..

నాలుగో రోజున క్షీణించినా..

ప్రపంచ సినిమా రంగంలో ఏ చిత్రానికి తొలి వారాంతం తర్వాత వచ్చే సోమవారం అగ్నిపరీక్షగా మారుతుంది. RRR విషయంలో కూడా అదే జరిగింది. చిన్న సెంటర్లలో స్వల్పంగా సినిమా కలెక్షన్లు క్షీణించాయి. కానీ రికార్డు వసూళ్లపై ప్రభావం పడేంతగా లేవని చెబుతున్నారు. సోమవారం రోజున రికార్డు కలెక్షన్లు నమోదు అవుతాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన కలెక్షన్లు

ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన కలెక్షన్లు

RRR సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను పెంచుకొంటూ తడాఖా చూపిస్తు్నది. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కలెక్షన్లను మరింత మెరుగు పరుచుకొంటున్నది. తొలి రోజు కలెక్షన్లకు అటూ ఇటుగా వసూళ్లను నమోదు చేస్తున్నది. హిందీ సెక్టార్‌లో RRR కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
హిందీ వెర్షన్ నాలుగో రోజు

హిందీ వెర్షన్ నాలుగో రోజు

RRR హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. ఈ చిత్రం తగ్గేదేలే అనే రేంజ్‌లో వసూళ్లను నమోదు చేస్తున్నది. సోమవారం సుమారు 15 కోట్ల నికర వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే తొలి సోమవారం అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సాధించిన 14.25 కోట్ల మార్కును అధిగమిస్తుందా అనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ చిత్రం తొలి వారం తర్వాత 120 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

అమెరికాలో నాలుగో రోజున

అమెరికాలో నాలుగో రోజున


RRR కలెక్షన్ల ప్రభంజనం ఇక ఉత్తర అమెరికాలో కూడా కొనసాగుతున్నది. ప్రీమియర్ల ద్వారా 3,469,127 అమెరికన్ డాలర్లు, తొలి రోజున 1,992,502 డాలర్లు, రెండో రోజున 2,406,822 డాలర్లు, మూడో రోజున 1,555,531, నాలుగో రోజున 151,356 డాలర్లకుపైగా రాబట్టే అవకాశం ఉంది. మత్తంగా ఈ చిత్రం 9,575,338 అమెరికన్ డాలర్లు, భారతీయ కరెన్సీలో 72.90 కోట్ల మేర రాబట్టే అవకాశం ఉంది.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో


తెలుగు సినిమాకు రాజధానిగా పేర్కొన్న హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో RRR చిత్రం రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తున్నది. 75.87 లక్షల రూపాయలు సాధిస్తే.. రెండో రోజున 66,89 లక్షల రూపాయలు, మూడో రోజున 66,00 లక్షల రూపాయలు, నాలుగో రోజున 44,05 లక్షలు సాధించింది. దీంతో ఈ సినిమా 2 కోట్ల అరుదైన రికార్డును సాధించింది.

తెలుగు రాష్రాల్లో నాలుగో రోజున

తెలుగు రాష్రాల్లో నాలుగో రోజున


RRR మూవీకి ఎదురే లేకుండా పోయింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణాన్ని థియేటర్ల వద్ద కనిపించేలా చేసింది. ఇక నాలుగో రోజున అంటే సోమవారం 16 కోట్ల మేర వసూళ్లను సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నాలుగో రోజున 35 కోట్ల షేర్‌ను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు తేల్చి చెప్పాయి.

నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?

నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?


RRR చిత్రానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను పరిశీలిస్తే.. తొలి రోజున 135 కోట్ల షేర్, 235 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక రెండో రోజున 67.44 కోట్లు, 121 కోట్ల గ్రాస్,, మూడో రోజున 78.73 కోట్లు షేర్, 140 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక నాలుగో రోజున 35 కోట్ల షేర్, 70 కోట్లకుపైగా గ్రాస్ వసూల్లను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నాలుగో రోజన 531 కోట్ల గ్రాస్ వసూళ్లు, 180 కోట్లకుపైగా నికర వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X