SSMB 28: మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్.. రాజమౌళి కంటే ముందే త్రివిక్రమ్ బిగ్ మూవీ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ఇక మొత్తానికి తన 28వ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇక ఇటీవల విడుదల తేదీ పై కూడా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఎంత ఖర్చు చేయబోతున్నారు అనే విషయంలో కూడా ఒక టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ రెండు సినిమాలు
సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ మొదట్లో అతడు అనే సినిమా చేశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్దగా లాభాలు అందించకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత టెలివిజన్లో మాత్రం భారీ స్థాయిలో టిఆర్పిని అందుకుంది. ఇప్పటికీ కూడా ఆ సినిమా ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక తర్వాత వచ్చిన ఖలేజా సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా మహేష్ బాబును త్రివిక్రమ్ సరికొత్తగా ప్రజెంట్ చేయడం ఫాన్స్ కు చాలా నచ్చింది.

పర్ఫెక్ట్ ప్లాన్ తో రిలీజ్
రెండు సినిమాలు వారి స్థాయికి తగ్గట్టు ఆడకపోయినా కూడా ఇప్పుడు మూడోసారి కలిసి సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు అంటే తప్పకుండా భారీ స్థాయిలోనే సినిమా చేయబోతున్నట్లుగా అభిమానుల్లో ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్రణాళికతో ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరిలోపు ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత ప్రొడక్షన్ పనులను కూడా కేవలం రెండు నెలల్లో పూర్తిచేసి ఏప్రిల్ 28 కి సినిమాను విడుదల చేయాలని ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు.

మహేష్ బాబుతో బిగ్ బడ్జెట్
ఇక ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఇదివరకే చాలా రకాల కథనాలు వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాబ్ ప్రకారమైతే సినిమా టోటల్ బడ్జెట్ 200 కోట్ల వరకు ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదటినుంచి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వర్క్ చేస్తున్న హారిక హాసిని సంస్థ ఇంతవరకు ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో ఖర్చు చేసింది లేదు. కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో కాబట్టి ఖర్చుకు ఏమాత్రం వెనకాడడం లేదట. రాజమౌళితో చేయబోయే సినిమా ఇంతకంటే ఎక్కువ బడ్జెట్ తోనే తెరపైకి రాబోతోంది. ఇక ఆ సినిమా కంటే ముందే త్రివిక్రమ్ మహేష్ బాబుతో బిగ్ మూవీ చేస్తూ ఉండడం విశేషం.

మహేష్ కు ఎంత ఇస్తున్నారంటే?
ప్రొడక్షన్ కాస్ట్ అలాగే మహేష్ బాబు రెమ్యురేషన్ తో కలిపి ఈ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. త్రివిక్రమ్ కూడా చాలావరకు బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. హారిక హాసిని సంస్థతో పాటు ఆయన కూడా ఒక భాగస్వామి గా ఉన్నారు. ముందుగా త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాల్లో షేర్ తీసుకోవాలని అనుకుంటున్నారు. గత సినిమాలకు కూడా ఆయనకు ఇదే ఇదే తరహాలో డీల్ సెట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు మాత్రం ఈ సినిమాకు 65 కోట్ల నుంచి 70 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











