Don't Miss!
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Finance
reliance q3: అంచనాలకు మించి రిలయన్స్ లాభాలు - మరి వారసుల సామర్థ్యమెంత??
- News
Bengaluru: తోడు దొంగలు, 60 చోట్ల చోరీలు, జడ్జ్ ఇంటిని వదలని కాలాంతకులు, క్లైమాక్స్ లో!
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
SSMB 29 Movie Budget: మహేష్ బాబుతో రాజమౌళి కనివిని ఎరుగని బడ్జెట్.. RRR కంటే ఎక్కువగా...
దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రేక్షకుల ఊహలకు అందకుండా తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తాడు. ప్రస్తుతం RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసినట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి అయితే రాజమౌళి మహేష్ బాబు తో చేయబోయే సినిమాకు సంబంధించిన టాక్ ఒకటి ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది. ఆ సినిమాకోసం RRR కంటే ఎక్కువగా కనివిని ఎరుగని బడ్జెట్ ను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ బడ్జెట్ ఎంత? సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే..

అనుకున్నట్లుగానే..
రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్.. ఇలా బడా స్టార్స్ తో దర్శకుడు రాజమౌళి చేసిన అద్భుత ప్రయోగం RRR బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో తప్పకుండా ఇండస్ట్రీలోనే అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని ఊహించారు. అనుకున్నట్లుగానే మొదటిరోజు బాక్సాఫీసు వద్ద బాహుబలి రికార్డులను బ్రేక్ చేసేసింది.

బడ్జెట్ పెంచుకుంటూ..
ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళి గత కొంత కాలంగా తన ప్రతి సినిమాకు సంబంధించిన బడ్జెట్ ను కూడా పెంచుకుంటూ వెళుతున్నాడు. బాహుబలి 2 అనంతరం RRR సినిమాకు అంతకుమించి అనేలా దాదాపు 500 కోట్ల ప్రొడక్షన్ కాస్ట్ తో నిర్మించడం జరిగింది. ఆ విషయంపై రాజమౌళి కూడా ఒక ఇంటర్వ్యూలో అఫీషియల్ గానే క్లారిటీ ఇచ్చాడు.

RRR కంటే భారీగా..
ఇక మహేష్ బాబుతో రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అఫీషియల్ గా ఇద్దరూ ఒక సరికొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు అని తెలుస్తోంది. ఒకవిధంగా ఆయన బాహుబలి RRR సినిమాల కంటే భారీగానే ఆ సినిమా ఉంటుంది అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా కు ఒక ప్రత్యేకమైన బజ్ క్రియేట్ అయ్యే విధంగా ప్లాన్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

బడ్జెట్ విషయంలో..
సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో కూడా ప్రస్తుతం అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమాను సీనియర్ నిర్మాత కేఎల్.నారాయణ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి తరచుగా నిర్మాత హీరో దర్శకుడితో చర్చలు జరుపుతూనే ఉన్నాడు. రీసెంట్ గా దర్శకుడు రాజమౌళి సినిమాకు సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేషన్ కూడా రెడీ అయినట్లు ఒక టాక్ వినిపించింది.

రూ.800 కోట్ల వరకు
ఇప్పటికే RRR సినిమాకు దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం అంతకుమించి అనేలా ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 800 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు అని కథనాలు వెలువడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ దర్శకుడు రాజమౌళి అయితే RRR సినిమా కంటే ఎక్కువ స్థాయిలో సినిమాను నిర్మించబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. కాబట్టి రూ.500 కోట్ల కంటే సినిమా బడ్జెట్ ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు.

ఆ బ్యాక్ డ్రాప్ లో కథ..?
ఇక మహేష్ బాబు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినప్పటికీ ఇంకా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఆయనకు సంబంధించిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కాలేదు అయినప్పటికీ రాజమౌళి తన బ్రాండ్ తోనే మహేష్ బాబును పవర్ఫుల్ హీరో గా చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు తో చేయబోయే సినిమా ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఉంటుంది అని ఇదివరకే కథారచయిత విజయేంద్రప్రసాద్ ఒక కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంకా ఫైనల్ కథ అయితే పూర్తి కాలేదని విజయేంద్రప్రసాద్ తెలియజేశారు.
Recommended Video


రిలీజ్ ఎప్పుడు?
ఇక ఈ సినిమాను ఎ ప్పుడు మొదలు పెడతారు అనే విషయంలోకి వెళ్తే.. ఈ ఏడాది చివర్లోనే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాకపోతే రాజమౌళి ముందుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కోసం ఎక్కువ సమయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి కాబట్టి ముందుగానే కొన్ని వర్క్ షాప్స్ కూడా నిర్వహించడం జరుగుతుందట. ఇక కుదిరితే సినిమాను 2024 చివరిలో లేదా 2025 మొదట్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.