Star Collections బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న స్టార్.. 12 కోట్ల బడ్జెట్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ప్రముఖ తెలుగు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, తమిళ నిర్మాత శ్రీనిధి సాగర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం స్టార్ (Star). శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు ఎలాన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాలో కెవిన్, అదితి పోహంకర్, లాల్ తదితరులు నటించిన ఈ చిత్రం మే 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? బ్రేక్ ఈవెన్ స్టాటస్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
తమిళ చిత్రం స్టార్ (Star) సినిమా విషయానికి వస్తే.. మధ్య తరగతికి చెందిన కలై (కెవిన్) అనే యువకుడు సినిమా పరిశ్రమలో హీరో కావాలని కలలు కంటాడు. అతడి కలకు పాండ్యన్ (లాల్) అండగా ఉంటాడు. అయితే సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా రాణించాలని తపన పడిన కలై కోరిక నెరవేరిందా? అనే ప్రశ్నకు సమాధానమే స్టార్ సినిమా కథ.

స్టార్ సినిమాను నూతన నటీనటులతో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. అయితే ప్రతిభావంతులైన టెక్నిషియన్స్‌తో సినిమా రూపొందించడం వల్ల ఖర్చు పెరిగింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా 12 కోట్లకుపైగా బడ్జెట్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబడితే గానీ బ్రేక్ ఈవెన్ సాధించే పరిస్థితి లేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
స్టార్ (Star) సినిమా ప్రమోషన్స్‌కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1000 కి పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. రిలీజ్ తర్వాత హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు గణనీయంగా ఆక్యుపెన్సీ పెరిగింది. ఈ సినిమాకు ప్రతీ రోజు 60 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదు అవుతున్నదని తమిళ ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. చెన్నైలో 80 శాతం, కోయంబత్తూరులో 70 శాతం, పాండిచ్చేరిలో 100 శాతం, దిండిగల్‌లో 75 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు తమిళంలోనే 2.5 కోట్లు, వరల్డ్ వైడ్‌గా 3 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు ఈ సినిమా తమిళంలో 3.5 కోట్లు, వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయలను, మూడో రోజు ఈ సినిమా 2.5 కోట్లు తమిళంలో, వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
స్టార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా తమిళంలో 8.5 కోట్ల గ్రాస్, ఇండియాలో 10 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు రాబట్టినట్టు తెలుస్తున్నది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ వసూళ్లను కేవలం 3 రోజుల్లోనే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











