»   » 'బాహుబలి 2' పై సీక్రెట్ ఎంక్వైరీ ,సీన్ లోకి నాగ్, అంత డబ్బుని ఇచ్చేసాడు

'బాహుబలి 2' పై సీక్రెట్ ఎంక్వైరీ ,సీన్ లోకి నాగ్, అంత డబ్బుని ఇచ్చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున నటుడుగా ఏ స్దాయిలో ఉన్నారో అంతకు మించి ఆయన పక్కా బిజినెస్ మ్యాన్ అని అందరికి తెలిసిందే. ఈ సారి ఆ విషయం మరోసారి రుజువైంది. ఎక్కడ డబ్బులు వస్తాయో నాగార్జున కు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదంటారు. అందుకేనేమో ఆయన బాహుబలి 2 రైట్స్ తీసుకున్నారు. ఆయనకు ఈ చిత్రం గురించి ఇన్ సైడ్ రిపోర్ట్ ఉందని తెలుస్తోంది. ఆయన ఈ చిత్రం హైలెట్స్ రీసెంట్ గా ఆ సినిమా టీమ్ ద్వారా విన్నాడట. అవి విన్న ఆయన షాక్ అయ్యి..ఆలస్యం చెయ్యకుండా నిర్ణయం తీసుకున్నారని సమాచారం.


రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' భారీ విజయాన్ని సాధించడంతో ఇప్పుడు బాహుబలి-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'బాహుబలి ది కన్‌క్లూజన్' పేరుతో రూపొందే ఈ చిత్రం అక్టోబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లింది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను మరింత ఆసక్తిగా తెరకెక్కించాలని రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై నెలకొనే క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని నాగార్జున రంగంలోకి దిగారు.


మరో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సాయి తో కలిసి కృష్ణా జిల్లా హక్కులు నాగ్‌ కొన్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇందుకోసం ఏకంగా 8 కోట్ల రూపాయలు చెల్లించినట్టు సమాచారం. నిజానికి గతేడాది విడుదలైన 'బాహుబలి' మొదటి భాగం కృష్ణా జిల్లాలో రూ.6.8 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు అంతుకు 1.2 కోట్ల రూపాయలు హక్కుల కోసమే చెల్లించారంటే ఆ సినిమా మీద ఎంత నమ్మకమో అర్థమవుతోందంటున్నారు.


మంచి బిజనెస్‌మ్యాన్‌గా కూడా పేరు తెచ్చుకున్న నాగార్జున ఓ ప్రాజెక్టులోకి దిగాడంటే ఎన్నో విశ్లేషణలు చేసే ఉంటాడని మిగతా ఏరియాలు రైట్స్ కు డిస్ట్రిబ్యూటల్స్ ఎగబడుతున్నారు. దాంతోనే 'బాహుబలి: ది కంక్లూజన్‌'ఇప్పుడు మరో క్రేజ్ వచ్చి చేరినట్లైంది.


మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో....


అంతే కాకుండా...

అంతే కాకుండా...

మరో ప్రక్క బాహుబలి-2 కోలీవుడ్‌లో థియేటర్ రైట్స్ అమ్ముడుపోయినట్టు టాక్. కొన్నది ఎవరన్నది పక్కనబెడితే.. ఏకంగా రూ. 52 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. 52 కోట్లు అనేది చాలా పెద్ద మొత్తమే. అయితే పోటీ పడి మరి ఈ రైట్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎంత నమ్మకం ఉంటే ఆ రేటు పెడతారని చర్చించుకుంటున్నారు.


అక్కడ తెలుగు రైట్స్ ని కూడా

అక్కడ తెలుగు రైట్స్ ని కూడా

ఈ సినిమా త‌మిళ హక్కులను ‘కే ప్రొడక్షన్స్‌' సంస్థ అధినేత ఎస్‌ఎన్‌ రాజరాజన్‌ పొందారు. అంతేకాకుండా తమిళనాట తెలుగు వెర్షన్‌ను విడుదల చేసే హక్కులను కూడా ఆయనే సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయ‌న దాదాపు రూ.52 కోట్లు బాహుబ‌లి నిర్మాత‌ల‌కు చెల్లించాడ‌ని టాక్. తెలుగు రైట్స్ పై కూడా ఆయనకి మంచి ఆదాయం వస్తుందని ఆయన లెక్కలు వేసుకునే తీసుకున్నట్లు చెప్తున్నారు.


గతంలో ఎంతంటే...

గతంలో ఎంతంటే...

గతంలో తమిళనాడులో బాహుబలి దాదాపు 30 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ లెక్కన 52 కోట్లు ఏమాత్రం తక్కువ కాదని, దీనికితోడు ఓవర్సీస్ కూడా వుంటుందని గుర్తు చేస్తున్నారు. తెలుగు మూవీ ఇప్పటివరకు ఆ రేంజ్‌లో కోలీవుడ్‌కి వెళ్లలేదని అంటున్నారు. కాబట్టి ఈ క్రెడిట్ పూర్తిగా బాహుబలికే దక్కింది. ఈ విషయమై ట్రేడ్ వర్గాల్లో భారీ ఎత్తున విశ్లేషణలు జరుగుతన్నాయి.


అంచనాలుకు తగ్గట్లే..

అంచనాలుకు తగ్గట్లే..

బాహుబ‌లి-2పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. వ‌చ్చే ఏడాది రానున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా, ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. తెలిసిన స‌మాచారం ప్ర‌కారం బాహుబ‌లి-2 ఇప్ప‌టికే 400 కోట్ల రూపాయ‌ల బిజినెస్ దాటేసింద‌ని చెబుతున్నారు. ఇంకా చాలా ఏరియాల్లో బిజినెస్ చేయాల్సి ఉంది. దీంతో ఇంకా బిజినెస్ పెరుగుతుంద‌ని ట్రేడ్ పండితులు అంటున్నారు. మొత్తానికి దేశంలో సినీ చ‌రిత్ర‌లోనే సంచ‌ల‌న చిత్రంగా ఉంటుంద‌ని అనుకుంటున్నారు.


షెడ్యూల్ ఇదీ...

షెడ్యూల్ ఇదీ...

ఆగష్టు చివరినాటికి బాహుబలి 2 వార్ సన్నివేశాల్ని ముగించాలని స్కెచ్ వేసి, అదే పనిచేసారు రాజమౌళి. ఆ తర్వాత కొంత యాక్షన్, స్టోరీ పార్ట్‌ను సెప్టెంబర్ ఎండింగ్‌కి కంప్లీట్ చేసి, మిగిలిన ఇంకాస్త పార్ట్‌ కోసం ఫారెన్ వెళ్లాలని షెడ్యూల్ వేసుకుంది. పలుమార్లు వర్షం అంతరాయం ఏర్పడడంతో జరగాల్సిన షూట్ కాస్త వాయిదా పడిపడినా తర్వాత ఫినిష్ చేసారు.


మూడో పార్ట్ ఉంటుందా

మూడో పార్ట్ ఉంటుందా

మూడోపార్ట్ విషయమై రాజమౌళి ఖండిస్తూ... తాను 'బాహుబలి-3' తీయడం లేదని, ప్రస్తుతం వెలువడుతున్న పుకార్లను నమ్మొదంటూ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు.'బాహుబలి-2'తోనే కథ ముగిసిపోతుందని... దీన్ని కొనసాగించడం లేదని వెల్లడించారు. అయితే మునుపెన్నడూ లేని రీతిలో అనుభూతిని పంచే విధంగా 'బాహుబలి' కొనసాగుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాల సమయానుకూలంగా ప్రకటిస్తానని తెలిపారు.


నా ఒక్కడికే తెలుసు....

నా ఒక్కడికే తెలుసు....

అలాగే కథలో తర్వాత ఏం జరుగుతుంది అనే విషయమై బయిట అనేక రూమర్స్ వస్తున్నాయని, అయితే ఏం జరుగుతుందన్న విషయం కేవలం తనకు ఒక్కరికి మాత్రమే తెలుసంటూ రాజమౌళి ట్వీట్‌ చేసి క్లారిటీ ఇచ్చారు. దాంతో బయిట వస్తున్న వార్తలను నమ్మాలో వద్దో అనే డైలమోలో అభిమానులు పడ్డారు. ఎందుకంటే కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడన్నదే ఇక్కడ కీలకం కదా.


రాజమౌళే చెప్పేసాడు

రాజమౌళే చెప్పేసాడు

బాహుబలి పార్ట్ 1 సినిమా చివరలో మనకు ప్రశ్నగా సస్పెన్స్ గా వదిలేసిన ..కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అన్న ప్రశ్నకు సంభందించిన క్లూ మనకి రాజమౌళి మొదటి రోజు షేర్ చేసిన ఫొటో, మరియు వీడియోతో ఇచ్చేసారు. ఈ ఫొటోలో లేదా వీడియోలో మీకు ... మహిష్మతి బ్రాస్ లెట్ ధరించిన ప్రబాస్ కనిపిస్తాడు. అంటే అమరేంద్రబాహుబలి కు చెందిన చెయ్యి అన్నమాట అది. శివుడు క్యారక్టర్ కు ఆ బ్రాస్ లెట్ లేదు. అంటే అమరేంద్ర బాహుబలి బ్రతికున్నట్లే. అలాగే సెకండాఫ్ లో అమరేంద్ర బాహుబలి...అనుష్క తో ప్రేమ కథ కూడా ఉండబోతోందన్నమాట.


ఫెరఫెక్షన్ కోసం ట్రైనింగ్ తప్పలేదు...

ఫెరఫెక్షన్ కోసం ట్రైనింగ్ తప్పలేదు...

షూటింగ్ మొదలవటానికి రెండు నెలలు ముందుగా ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కఠోర శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు.ఇక ఈ యుద్ధ సన్నివేశం షూటింగ్ కోసం హాలీవుడ్ నుంచి నిపుణుల బృందం పెద్ద ఎత్తున దిగింది. గతంలో లింగా, బాహుబలి సినిమాలకు యాక్షన్ డైరెక్షన్ చేసిన లీ వీట్టేకర్ ఇప్పుడు ఈ సినిమా కోసం వచ్చాడు. అతడితో పాటు బ్రాడ్ అలన్, అతడి బృందం మొత్తం దిగింది.


హాలీవుడ్ బ్యాచ్ మొత్తం దిగిందిగా

హాలీవుడ్ బ్యాచ్ మొత్తం దిగిందిగా

ఇంతకుముందు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాతో పాటు 'ద హంగర్ గేమ్స్' సిరీస్‌కు పనిచేసిన లార్నెల్ స్టోవాల్, 'ద హాబిట్' సినిమాకు పనిచేసిన మోర్న్ వాన్ టాండర్ లాంటివాళ్లు బాహుబలి 2 క్లైమాక్స్ సన్నివేశాల పనిచేసారు. వీళ్లందరినీ సమన్వయం చేసుకుంటూ రాజమౌళి క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించకరించారు.


కరణ్ జోహార్ ప్రకటన

కరణ్ జోహార్ ప్రకటన

రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం తెలసుకోవడానికైనా చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెలిపారు.


అన్ని జాగ్రత్తలతో రిలీజ్

అన్ని జాగ్రత్తలతో రిలీజ్

బాహుబలి పార్ట్ 1 విడుదల సందర్భంగా తెలుగునాట థియేటర్ల వద్ద జాతర వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల టికెట్ల కోసం గొడవలు జరిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి అలాంటి ఇబ్బందులు, బ్లాక్ మార్కెటింగ్ లాంటివి జరుగకుండా పకడ్భంధీ ఏర్పాట్లు చేయనున్నారు.


English summary
Nagarjuna has bought Baahubali: The Conclusion rights of Krishna district along with noted producer Sai Korrapati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu