NBK107: ఆ ఛానెల్‌కు బాలయ్య మూవీ రైట్స్.. రికార్డు రేటుతో ఒప్పందం
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అందుకే మునుపెన్నడూ లేని విధంగా ఆయన ఒకటి పట్టాలపై ఉండగానే మరొకటి అన్నట్లుగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. దీనికితోడు గత ఏడాది 'అఖండ'తో అదిరిపోయే హిట్‌ను సొంతం చేసుకున్న తర్వాత బాలయ్య మరింత జోష్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన.. మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేనితో ఓ పవర్‌ఫుల్ మూవీని చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయని తెలిసిందే.
పవర్‌ఫుల్ మాస్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినా.. రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ఈ ఫిబ్రవరి నుంచే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేక్ లేకుండా చిత్ర యూనిట్ షూటింగ్‌ను చేసుకుంటూ వచ్చింది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపు 80 శాతం పైగా టాకీ పార్టును పూర్తి చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్యాప్‌లో చిత్ర యూనిట్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌పై ఫోకస్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న మూవీకి సంబంధించిన శాటిలైట్ రైట్స్‌కు అప్పుడే భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ హక్కులను స్టార్ మా సంస్థ సొంతం చేసుకుందట. ఇందుకోసం సదరు సంస్థ ఏకంగా కొన్ని కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిసింది. దీంతో ఆ ఛానెల్ భారీ ధరకు కొనుగోలు చేసిన అతి తక్కువ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచిందని అంటున్నారు. అంతేకాదు, బాలయ్య కెరీర్‌లోనే ఇది అత్యధిక శాటిలైట్ డీల్ అని కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
బాలకృష్ణ 107వ చిత్రంగా రాబోతున్న ఇందులో శృతి హాసన్ హీరయిన్‌గా చేస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, ఎస్ థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











